PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్
ABN, Publish Date - May 26 , 2025 | 08:41 PM
కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిందని, భారత్ గణనీయమని ఆర్థిక ప్రగతి సాధించిందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. పాక్ పరిస్థితి ఏమిటని నిలదీశారు. జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని, పాకిస్థాన్ ఎక్కడ ఉందో ఆలోచించుకోవాలని అన్నారు.
భుజ్: ఉగ్రవాదానికి పాక్ స్వస్తి చెప్పాలని, ఇందుకు ఆ దేశ ప్రజలు ముందుకు రావాలని, శాంతిని ఎంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. అలాకాని పక్షంలో తన 'బుల్లెట్' రెడీగా ఉందని హెచ్చరించారు. గుజరాత్‌లో రెండ్రోజుల పర్యటనలో భాగంగా భుజ్‌లో సోమవారంనాడు జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి తెరపడాలంటే ఆ దేశ ప్రజలు ముందుకొచ్చి, ఎవరి తిండి వారు తింటూ ప్రశాంత జీవనం సాగించాలని, లేదంటే బుల్లెట్ తన దగ్గర సిద్ధంగా ఉందని అన్నారు.
కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిందని, భారత్ గణనీయమని ఆర్థిక ప్రగతి సాధించిందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. పాక్ పరిస్థితి ఏమిటని నిలదీశారు. జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని, పాకిస్థాన్ ఎక్కడ ఉందో ఆలోచించుకోవాలని అన్నారు.
టూరిజం మాది.. టెర్రరిజం మీది
భారతదేశం పర్యాటకాన్ని (టూరిజం) నమ్ముకుంటే పాకిస్థాన్ టెర్రరిజంను నమ్ముకుంటోందని, అది ప్రపంచానికి ప్రమాదకరమని ప్రధాని అన్నారు. పాకిస్థాన్ ప్రజలను ఒకటి అడగదలచుకున్నాను. టెర్రరిజం వల్ల ఏమి సాధించారు? ఇవాళ ప్రపంచంలోనే భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మీ పరిస్థితి ఎలా ఉంది? ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారు మీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు.. అని మోదీ అన్నారు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకుంటుందనే ఆశాభావంతో 15 రోజులు వేచిచూశానని, అయితే ఉగ్రవాదం ఊపిరిగా ఉన్న పాక్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రధాని చెప్పారు. మానవత్వాన్ని కాపాడేందుకు, ఉగ్రవాదానికి చరమగీతం పాడేందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టామని తెలిపారు. మే 9న పౌరులనే లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులకు ప్రయత్నించడంతో ఇండియన్ ఆర్మీ రెట్టించిన బలంతో వారి మిలటరీ స్థావరాలను ధ్వంసం చేసిందని చెప్పారు. కాగా, ఈ సభకు ముందు ప్రధాని వడోదరలో భారీ రోడ్‌షో నిర్వహించారు. కల్నల్ సోఫియా ఖురేష్ కుటుంబ సభ్యులతో పాటు పెద్దఎత్తున ప్రజలు ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News
Updated Date - May 26 , 2025 | 08:41 PM