ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pehalgam Terror Attack: ఉగ్రదాడి.. కాంగ్రెస్ పార్టీ తీర్మానం ఇదే..

ABN, Publish Date - Apr 24 , 2025 | 03:00 PM

Pehalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రదాడిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీవ్రంగా ఖండించింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర హోం శాఖ పర్యవేక్షిస్తోందని.. అలాంటి చోట ఈ దాడి జరగడం పట్ల సీడబ్ల్యూసీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది కేంద్ర వైఫల్యమని స్పష్టం చేసింది.

CWC Meeting

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఖండించింది. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపింది. గురువారం న్యూఢిల్లీ అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సభ్యులు సమావేశమై.. ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ దుఖ: సమయంలో పూర్తిగా వారిని మద్దతుగా నిలబడతామని ప్రకటించింది. ఈ దాడి పాకిస్తాన్ మద్దతుతో సుదీర్ఘంగా పన్నిన కుట్రగా సీడబ్ల్యూసీ ఈ సందర్భంగా అభివర్ణించింది.

ఇది భారత ప్రజాస్వామ్య విలువలపై నేరుగా దాడి అని అభిప్రాయపడింది. ఈ ఉగ్రదాడిలో పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో భాగంగా ప్రాణత్యాగం చేసిన స్థానికుడి పోరాటాన్ని గుర్తు చేసుకొంది. ప్రధాని ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్వయంగా పర్యవేక్షిస్తుందని గుర్తు చేసింది.


అలాంటి ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం భద్రతా వైఫల్యమేనని పేర్కొంది.ఈ అంశపై లోతైన పరిశీలన జరగాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. మరికొద్ది రోజుల్లో అమరనాథ్ యత్ర ప్రారంభం కానుందని గుర్తు చేసింది. ఈ యాత్రకు భద్రత దృష్ట్యా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రాన్ని సూచించింది. అందుకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు పారదర్శకంగా.. సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

పర్యాటకంపై ఆధారపడి జీవించే స్థానిక ప్రజల జీవనోపాధిని పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషాదకర ఘటనను బీజేపీ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటుందంటూ సీడబ్ల్యూసీ కీలక ఆరోపణ చేసింది. దేశాన్ని ఏకతాటిపై నడపాల్సిన ఈ సమయంలో విభేదాలు రేకేత్తించే విధంగా రెచ్చగొట్టడం తగదని బీజేపీ నేతలకు సిడబ్ల్యూసీ సభ్యులు హితవు పలికారు.


ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకొంది. ఆ క్రమంలో పాక్‌తో ఉన్న బంధాన్ని దాదాపుగా తెంచేసుకొంది. అందులోభాగంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపి వేసింది. న్యూఢిల్లీలోని పాక్ రాయబారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

అట్టారి, వాఘా సరిహద్దును మూసి వేస్తున్నట్లు చెప్పింది.ఈ తరహా చర్యలతో పాక్ దుందుడుకు చర్యలను కట్టడి చేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు.. పహల్గాం చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

kyiv:కీవ్‌పై రష్యా దాడి.. తొమ్మిది మంది మృతి

India Vs Pakistan: కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న పాకిస్తాన్

Rahul Gandhi: పర్యటన రద్దు చేసుకొన్న రాహుల్.. ఎందుకంటే..

Pahalgam Terror Attack: ఇంతకీ సింధు నదీ జలాలు ఒప్పందం ఎప్పుడు.. ఎందుకు జరిగిందో తెలుసా..

Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఆర్మీ జవాన్ మృతి

Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు

Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..

Pahalgam Terror Attack: న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం పిలుపు

Pahalgam Terror Attack: పాక్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

For National news And Telugu News

Updated Date - Apr 24 , 2025 | 03:01 PM