ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan violates ceasefire: మళ్లీ కవ్వింపు చర్యలకు దిగిన పాక్

ABN, Publish Date - May 04 , 2025 | 07:37 AM

Pakistan violates ceasefire: పాకిస్థాన్‌కి వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ పాక్ మాత్రం.. తన తీరు మార్చుకోవడం లేదు. భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతోంది.

న్యూఢిల్లీ, మే 04: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే పాకిస్థాన్ తన తెంపరితనాన్ని మాత్రం వీడడం లేదు. ఈ ఉగ్రదాడి జరిగిన కొద్ది రోజుల నుంచే భారత్‌పై పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. నాటి నుంచి వరుసగా ప్రతి రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తునే ఉంది. 10వ రోజు.. అంటే శనివారం అర్థరాత్రి సైతం పాక్ సైన్యం దేశ సరిహద్దుల్లోని పలు జిల్లాల్లో.. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజోరి, నౌషిరా, సుందర్బనీ, అక్నూర్‌ జిల్లాల్లోని సైనికుల పోస్టులే లక్ష్యంగా చేసుకొని కాల్పులకు దిగుతోంది. దీంతో భారత్ సైన్యం వెంటనే స్పందించి.. పాక్ దళాలకు ధీటుగా సమాధానమిచ్చింది. ఈ కాల్పుల ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు.


ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ ఘటన వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనే బలమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌పై పలు దఫాలుగా తీవ్ర ఆంక్షలను భారత్ విధించింది. దీంతో పాకిస్థాన్‌తో సంబంధాలను పూర్తిగా తెగతెంపులు చేసుకున్నట్లు అయింది. ఇక పాకిస్థాన్‌ నుంచి దిగుమతయ్యే అన్ని వస్తువులపై భారత్ నిషేధం విధించింది. భారత్ ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలకే పాకిస్తాన్ సైతం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే నౌకలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదంటూ పాకిస్థాన్ నిర్ణయించింది. అయితే పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఆ దేశ వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదనే ఓ చర్చ సైతం సాగుతోంది.

ఇవి కూడా చదవండి

Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి

IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..

For National News And Telugu News

Updated Date - May 04 , 2025 | 08:35 AM