Share News

Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి

ABN , Publish Date - May 03 , 2025 | 07:21 PM

Vastu Tips: నిద్రపోవడానికి ముందే పాత్రలన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. అలా చేయటం వల్ల నెగిటివిటీ తొలగిపోతుంది. తిన్న వెంటనే మన ప్లేటు మనమే కడుక్కోవాలి. మిగిలన పాత్రలన్నీ కడిగేయాలి.

Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
Vastu Tips

వాస్తు శాస్త్రం వల్ల ఇంట్లో సుఖ శాంతులు ఉండటమే కాదు.. చాలా సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది. మనం ఎంత మాత్రము పట్టించుకోని .. దృష్టి పెట్టని విషయాల వల్లే మన ఇంట్లో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని వస్తువుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అవ్వటమే కాదు.. కొత్త కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి.


బంగారాన్ని ఇక్కడ పెట్టకూడదు

బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువుల్ని నైరుతి వైపు అస్సలు పెట్టకూడదు. బీరువాలు లేదా.. కప్ బోర్డులు ఉత్తరం వైపుగానీ, తూర్పు వైపు గానీ పెట్టాలి. ఇలా చేయటం వల్ల సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంటి ఆవరణలో కచ్చితంగా తులసి మొక్క ఉండాలి. తులసిలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది.

పాత్రలన్నీ క్లీన్‌గా ఉండాలి..

వాస్తు శాస్త్రం ప్రకారం శుభ్రం చేయకుండా ఉంచిన పాత్రల కారణంగా ఆర్థికంగా సమస్యలు తలెత్తుతాయి. నిద్రపోవడానికి ముందే పాత్రలన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. అలా చేయటం వల్ల నెగిటివిటీ తొలగిపోతుంది. తిన్న వెంటనే మన ప్లేటు మనమే కడుక్కోవాలి. మిగిలన పాత్రలన్నీ కడిగేయాలి.


బెడ్‌పై తినటం

చాలా మంది పడుకునే బెడ్ మీదే తింటూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మంచి అలవాటు కాదు. ఇలా చేయటం వల్ల సక్సెస్ విషయంలో మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. బెడ్‌పై తిండి తినే వారు అప్పుల్లో కూరుకుపోతారు.

షూ స్టాండ్

షూ స్టాండ్‌ను కొంతమంది ఇంటికి ఎదురుగా అస్సలు పెట్టకూడదు. ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఇంట్లో సుఖశాంతులు కరువవుతాయి. షూ స్టాండ్‌ను దక్షిణం వైపు గానీ.. నైరుతి వైపు గానీ ఉంచాలి. షూ స్టాండ్‌ను ఉత్తరం వైపు గానీ, అగ్నేయం.. తూర్పు వైపు అస్సలు పెట్టకూడదు.

గడియారం

వాస్తు శాస్త్రం ప్రకారం గడియారం తూర్పు వైపు గానీ, పడమర వైపు గానీ, ఉత్తరం వైపు గానీ పెట్టాలి. గడియారాన్ని ఈ చోట్ల పెట్టడం వల్ల అవకాశాలు వెల్లువలా వస్తాయి. ఆకుపచ్చ రంగులో ఉండే గడియారాలను అస్సలు కొనకండి. అవి అవకాశాలను నాశనం చేసే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..

Pahalgam Terror Attack: ఉగ్రవాదుల కోసం వేట.. కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్

Updated Date - May 03 , 2025 | 07:28 PM