Share News

IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..

ABN , Publish Date - May 03 , 2025 | 06:52 PM

IPL 2025: ఆ వీడియోను పోస్టు చేసిన వ్యక్తి ‘ ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్’ అని పేరు కూడా పెట్టేశాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..
IPL 2025

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న అద్భుతాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. ఒకటేమిటి .. దాదాపు అన్ని రంగాల్లోనూ ఏఐ తన సత్తా చాటుతోంది. మరీ ముఖ్యంగా వీడియో మోకింగ్‌లో ఏఐ అద్భుతాలు క్రియేట్ చేస్తోంది. తాజాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెటర్లకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఆ వీడియో నెటిజన్లకు పిచ్చ పిచ్చగా నచ్చుతోంది. ఆ వీడియోను క్రికెట్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ అందులో ఏముందంటే..


ఇప్పుడు ఐపీఎల్‌లో క్రికెట్ ఆడుతున్న క్రికెటర్లు అందరూ ఎంతో ఫిట్‌గా ఉన్నారు. ఒక వేళ వారు లావుగా మారిపోతే.. లావుగా మారిన తర్వాత ఐపీఎల్ క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందో ఆ వీడియోలో ఉంది. ధోనీ, రోహిత్ శర్మ, కోహ్లీలతో పాటు చాలా మంది క్రికెటర్లకు సంబంధించిన దృశ్యాలు అందులో ఉన్నాయి. ఆ వీడియోను పోస్టు చేసిన వ్యక్తి ‘ ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్’ అని పేరు కూడా పెట్టేశాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.


గమనిక : ఈ వీడియో ద్వారా మేము బాడీ షేమింగ్‌ను ఏ విధంగానూ ప్రోత్సహించటం లేదు. కండలు తిరిగిన క్రికెటర్లు లావుగా అయితే.. ఐపీఎల్ క్రికెట్ ఆడితే.. ఎలా ఉంటుందో చూపించడానికి మాత్రమే వీడియోను తీసుకోవటం జరిగింది. మేము బాడీ షేమింగ్‌ను ఏ విధంగానూ ప్రోత్సహించటం లేదని స్పష్టం చేస్తున్నాము.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: ఆ ఉగ్రవాదుల్ని వదిపెట్టం.. స్పష్టం చేసిన ప్రధాని మోదీ

Pahalgam Terror Attack: ఉగ్రవాదుల కోసం వేట.. కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్

Updated Date - May 03 , 2025 | 07:09 PM