Share News

Pahalgam Terror Attack: ఆ ఉగ్రవాదుల్ని వదిపెట్టం.. స్పష్టం చేసిన ప్రధాని మోదీ

ABN , Publish Date - May 03 , 2025 | 04:50 PM

Pahalgam Terror Attack: ప్రధాని మోదీ ఉగ్రవాదంపై మరో సారి మాట్లాడారు. ఉగ్రవాదులపై .. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శనివారం అంగోలా ప్రెసిడెంట్ జావో లూరెన్కోతో ఢిల్లీలో ఉమ్మడి ప్రెస్ కాన్పిరెన్స్ జరిగింది.

Pahalgam Terror Attack: ఆ ఉగ్రవాదుల్ని వదిపెట్టం.. స్పష్టం చేసిన ప్రధాని మోదీ
Pahalgam Terror Attack

జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఉగ్రమూకల కాల్పుల్లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం .. ఉగ్రవాదులకు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పే దిశలో చర్యలు మొదలెట్టింది. సరిహద్దుల దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదం గురించి తరచుగా స్పందిస్తూనే ఉన్నారు.


శనివారం కూడా ప్రధాని మోదీ ఉగ్రవాదంపై మాట్లాడారు. ఉగ్రవాదులపై .. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంగోలా ప్రెసిడెంట్ జావో లూరెన్కోతో ఢిల్లీలో ఉమ్మడి ప్రెస్ కాన్పిరెన్స్ జరిగింది. ఈ ప్రెస్ కాన్ఫీరెన్స్ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ మానవాళి మనుగడకు టెర్రరిజం అతి ప్రమాదకరమైనదని రెండు దేశాలు నమ్ముతున్నాయి. టెర్రిరిస్టులపై .. టెర్రిరిజాన్ని సపోర్టు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న దృఢనిశ్చయంతో ఉన్నాము. సరిహద్దుల దగ్గర టెర్రరిజాన్ని అరికట్టడంతో మాకు సహకరిస్తున్నందుకు అంగోలాకు కృతజ్ణతలు.


దాదాపు రెండు దేశాలు 40 ఏళ్లుగా భాగస్వామ్యంలో కలిసి ముందుకు నడుస్తున్నాయి. అంగోలా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నపుడు.. ఇండియా నమ్మకం, స్నేహంతో అండగా నిలిచింది. ఆఫ్రికన్ దేశాల నుంచి మాకు గత పదేళ్లు ఎంతో వేగవంతమైన సహకారం అందింది. వ్యాపారం 100 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఎనిమిది దేశాల్లో ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లను తెరిచాము. ఓ ఐదు దేశాల్లో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో సహకరిస్తున్నాము. ఆఫ్రికాలో 17 కొత్త ఎంబసీలను తెరిచాము’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

Janu Lyri: రెండో పెళ్లి కన్ఫార్మ్ చేసిన జాను లిరి.. అతడి ఫొటో షేర్ చేసి మరీ..

Kannada News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కర్రీ, సాంబార్ సరిగా చేయలేదని..

Updated Date - May 03 , 2025 | 04:54 PM