Share News

Janu Lyri: రెండో పెళ్లి కన్ఫార్మ్ చేసిన జాను లిరి.. అతడి ఫొటో షేర్ చేసి మరీ..

ABN , Publish Date - May 03 , 2025 | 03:40 PM

Janu Lyri: ప్రముఖ ఫోక్ డ్యాన్సర్, ఢీ షో విజేత జాను లిరి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారమే నిజం అయింది. శనివారం అఫిషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది.

Janu Lyri: రెండో పెళ్లి కన్ఫార్మ్ చేసిన జాను లిరి.. అతడి ఫొటో షేర్ చేసి మరీ..
Janu Lyri

ప్రముఖ డ్యాన్సర్ ఝాన్సీ అలియాస్ జాను లిరి పెళ్లి పీటలు ఎక్కబోతోంది. అతి త్వరలో ప్రేమ పెళ్లి చేసుకోబోతోంది. ఈ మేరకు జాను లిరి రెండో పెళ్లికి సంబంధించి అఫిషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ఈ విషయాన్ని జాను లిరి తన సోషల్ మీడియా ఖాతాలో స్పష్టం చేసింది. శనివారం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో కాబోయే భర్తతో దిగిన ఫొటోను షేర్ చేసింది. ‘ నన్ను సపోర్టు చేస్తున్నందుకు కృతజ్ణతలు. నన్ను దీవించండి’ అని రాసుకొచ్చింది. ఇక, ఈ పోస్టు ఇన్‌స్టాలో వైరల్ అయిపోయింది. మిత్రులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక, జాను లిరి కాబోయే భర్త ఓ ఫోక్ సింగర్. పేరు దిలీప్. అతడు కూడా పెళ్లి గురించి కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు.


నా పెళ్లి వల్ల మీకు నష్టం ఉందా

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ జాను రిలి ఎమోషనల్ అయింది. శుక్రవారం ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో వెక్కి వెక్కి ఏడ్చింది. శనివారం ఆ వీడియోపై వివరణ ఇస్తూ మరో వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో.. ‘ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ .. నిన్న నేను విడుదల చేసిన వీడియో వల్ల చాలా మంది బాధపడ్డారు. చాలా మంది రియాక్ట్ అయ్యారు. చాలా మంది సపోర్టు చేశారు. సపోర్టు చేసిన వారికి థ్యాంక్యూ సోమచ్. నేను చాలా రోజుల నుంచి అన్నీ చూస్తూ ఉన్నా. అది భరించలేక బాధ అనిపించి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను.


నా ఫ్యామిలీ నాకు చెప్పలేకుండా బాధపడుతున్నారని ఆలోచించి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అంతేతప్ప.. నేను ఎవరికీ భయపడేదాన్ని కాదు. భయపడితే.. ఈ స్టేజిలో ఉండేదాన్ని కాదు.. నేను చాలా స్ట్రాంగ్.. మీ అందరికీ తెలుసు. పెళ్లి గురించి ఓ విషయం. నా పెళ్లి వల్ల మీకేమైనా నష్టం ఉందా. లేదుకదా.. కొత్త లైప్ స్టార్ట్ చేయబోతున్నాను. నేను, నా కొడుకు సంతోషంగా ఉండి.. ఆ సంతోషంతో మీకు సమాధానం చెబుతాము. నిన్ని చేసిన వీడియోను కొంతమంది మంచిగా తీసుకున్నారు. కొంత మంది చెడుగా తీసుకున్నారు. ట్రోలింగ్ ఆగదు. నాకు అర్థం అయింది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య.. పోలీసులకు దొరికిన లేఖ..

Jio Offer: రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్

Updated Date - May 03 , 2025 | 04:00 PM