ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rajnath Singh: అంతర్జాతీయ టెర్రరిజానికి తండ్రి పాకిస్థాన్... నిప్పులు చెరిగిన రాజ్‌నాథ్

ABN, Publish Date - Jun 10 , 2025 | 10:00 PM

రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు లక్ష్యంగా మరింత పటిష్ట, స్వయంసమృద్ధ భారత్‌కు కృషి జరుగుతోందని, ఇదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢ వైఖరి తీసుకున్నామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Rajnath Singh

డెహ్రాడూన్: భారతదేశ చరిత్రలో ఉగ్రవాదంపై జరిపిన అతిపెద్ద దాడి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా జరిపిన ఆపరేషన్ సిందూర్ భారతదేశ భద్రతా వ్యూహాన్ని బలంగా చాటిచెప్పిందని తెలిపారు. డెహ్రాడూన్‌లో జరిగిన నేషనల్ సెక్యూరిటీ డైలాగ్‌లో రాజ్‌నాథ్ ఉత్తేజభరితమైన ప్రసంగం చేశారు. భారతదేశ రక్షణ, భద్రతా వ్యవస్థకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా విస్తృతమైన సంస్కరణలు చేపట్టిందని ప్రశంసించారు. రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు లక్ష్యంగా మరింత పటిష్ట, స్వయంసమృద్ధ భారత్‌కు కృషి జరుగుతోందని, ఇదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢ వైఖరి తీసుకున్నామని అన్నారు.

కేంద్రం 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో శాంతి పవనాలు వీస్తూ, ప్రగతిపథంలోకి దూసుకువెళ్తున్నామని అన్నారు. దీనిని పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా పట్టాలు తప్పించే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యపట్టారు. పాకిస్థాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కశ్మీర్ ప్రగతిని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యానికి తల్లిగా భారత్ గుర్తింపు తెచ్చుకుందని, పాకిస్థాన్ మాత్రం అంతర్జాతీయ ఉగ్రవాదానికి తండ్రిగా మారిందని అన్నారు. పాకిస్థాన్‌కు విదేశీ నిధులు ఆపేయాలని అంతర్జాతీయ కమ్యూనిటీకి విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్‌కు నిధులు ఇస్తే ఉగ్రవాదానికి నిధులిచ్చినట్టేనని అన్నారు.

స్వదేశీ రక్షణ ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివిరిస్తూ, 2013-2014లో రూ.2.53 లక్షల కోట్లు ఉన్న రక్షణ బడ్జెట్‌ను 2024-2025లో 6.22 లక్షల కోట్లకు పెంచామని చెప్పారు. రక్షణ ఉత్పత్తులు రూ.1.30 లక్షల కోట్ల నుంచి రూ.686 కోట్లకు పెరిగాయని చెప్పారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ ఉత్పత్తుల లక్ష్యం రూ.1.75 లక్షలుగా, ఎగుమతులు రూ.30,000 కోట్లుగా ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

అఖిల పక్ష ఎంపీల ప్రతినిధి బృందంతో మోదీ

కర్ణాటకలో మళ్లీ కులగణన.. అధిష్ఠానం ఆదేశం

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 10:02 PM