ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: 600 డ్రోన్లతో తెగబడిన పాక్.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి

ABN, Publish Date - May 31 , 2025 | 06:58 PM

సరిహద్దుల వెంబడి పాక్ ప్రయోగించిన 600 డ్రోన్లలో సుమారు 40 శాతం, అంటే 2000 వరకూ డ్రోన్లు గుజరాత్ భూభాగంలోకి ఎలాగో ప్రవేశించినప్పటికీ ఎలాంటి మరణాలు కానీ, నష్టం కానీ సంభవించలేదని గుజరాత్ బీఎస్ఎఫ్ ఐజీ పాఠక్ వివిరించారు.

అహ్మదాబాద్: ఆపరేషన్ సిందూర్ (Operational Sindoor) సమయంలో పాకిస్థాన్ 600కు పైగా డ్రోన్లు ప్రయోగించినట్టు బీఎస్ఎఫ్ గుజరాత్ ఐజీ (IG) అభిషేక్ పాఠక్ (Abhisekh Pathak) సంచలన విషయం వెల్లడించారు. అయితే వాటన్నింటినీ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు విజయవంతంగా కూల్చేసినట్టు చెప్పారు. పౌరులకు కానీ, సెక్యూరిటీ సిబ్బందికి కానీ ఎలాంటి హాని కలుగకుండా డిఫెన్స్ మెకానిజం అద్భుత పనితీరు ప్రదర్శించిందని గాంధీనగర్‌లో మీడియాతో శనివారంనాడు మాట్లాడుతూ చెప్పారు.


'మే 8 తర్వాత పాకిస్తాన్ డ్రోన్లు అన్నీ పనికిరాకుండా పోయాయి. క్షిపణలు, డ్రోన్లతో తీవ్రమైన దాడులకు పాల్పడినా డిఫెన్స్ సిస్టమ్ అసమాన రీతిలో వాటిని తుత్తినియలు చేసింది. మనకెలాంటి నష్టం జరగలేదు' అని ఐజీ పాఠక్ తెలిపారు.


గుజరాత్‌లోకి ప్రవేశించిన 200 డ్రోన్లు

సరిహద్దుల వెంబడి పాక్ ప్రయోగించిన 600 డ్రోన్లలో సుమారు 40 శాతం, అంటే 200 వరకూ డ్రోన్లు గుజరాత్ భూభాగంలోకి ఎలాగో ప్రవేశించినప్పటికీ ఎలాంటి మరణాలు కానీ, నష్టం కానీ సంభవించలేదని పాఠక్ వివిరించారు. ఉధృతంగా దాడులు చేసే ఉద్దేశంతో గుజరాత్ సరిహద్దుల వెంబడి ట్యాంకులు, పెద్దఎత్తున ఆర్టిలరీని పాక్ మోహరించిందని చెప్పారు.


మహిళా జవాన్ల కీలక పాత్ర

ఆపరేషన్ సిందూర్‌లో మహిళా అధికారుల పాత్రను ఐజీ ప్రశంసించారు. 800 మందికి పైగా బీఎస్ఎఫ్ మహిళా జవాన్లు సరిహద్దుల్లో మోహరించినట్టు చెప్పారు. క్రీక్ ఏరియా పర్యత ప్రాంతంలో కంపెనీ కమాండర్లుగా అసిస్టెంట్ కమాండెండ్లు అమన్‌దీప్, నీతి యాదవ్‌లు తమ తమ బెటాలియన్లకు సమర్ధవంతంగా నాయకత్వం వహించారని తెలిపారు.


పాక్‌కు భారీగా నష్టం

ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు భారీగా నష్టం జరిగిందని పాఠక్ తెలిపారు. బహవల్పూర్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 20 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, 35 నుంచి 45 మంది పాకిస్థాన్ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. దాడుల నేపథ్యంలో ఇండియా-పాక్ సరిహద్దుల వెంబడి రాజస్థాన్‌లోని బార్మెర్ నుంచి గుజరాత్‌లోని కచ్ వరకూ బీఎస్ఎఫ్ గార్డులు నిరంతర పహారా, నిఘా కొనసాగుతోందన్నారు.


ఇవి కూడా చదవండి..

జాతీయ వీరత్వానికి చిహ్నంగా సింధూరం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

భారత్- పాక్ యుద్ధంలో ఫైటర్ జెట్లు కోల్పోయాం.. సీడీఎస్ వెల్లడి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 08:20 PM