India Pakistan War: భారత్‌పై దాడులు.. పాక్ ఫేక్ క్యాంపెయిన్.. అసలు నిజం ఇదే..
ABN, Publish Date - May 09 , 2025 | 10:50 AM
Pakistan: యుద్ధం చేతగాని పాకిస్థాన్ నక్కబుద్ధి చూపిస్తోంది. ఫేక్ క్యాంపెయినింగ్‌తో పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. ఏదో సాధించామంటూ తమ ప్రజల మద్దతు దక్కించుకోవాలని భావిస్తోంది. కానీ అంతా రివర్స్ అయింది.
యుద్ధం కావాలి అంటూ బీరాలు పోయిన పాకిస్థాన్.. భారత్ చేస్తున్న వార్‌కు వణుకుతోంది. తొడ కొట్టి బరిలోకి దిగిన మన త్రివిద దళాలు దాయాదికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఉగ్ర స్థావరాలు, సైనిక క్యాంపులే లక్ష్యంగా దాడులు చేస్తూ భయం ఎలా ఉంటుందో వాళ్లకు పరిచయం చేస్తున్నాయి. పాక్ కూడా ప్రతిదాడులు చేసినా అవేవీ సక్సెస్ కాలేదు. ఆ దేశం సంధించిన డ్రోన్స్, మిసైల్స్‌ను మార్గమధ్యలోనే కూల్చేసింది భారత ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇంత జరుగుతున్నా పాకిస్థాన్ ఫేక్ క్యాంపెయినింగ్ ఆపడం లేదు. భారత్‌పై దాడులు చేశామని.. అందులో విజయవంతం అయ్యామంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు..
నిజం ఇదే..
రాజౌరిలో సూసైడ్ అటాక్ జరిగిందని, గుజరాత్ పోర్ట్‌ను పేల్చేశాం, జలంధర్‌లో డ్రోన్లతో కొట్టేశామంటూ ఇష్టం వచ్చినట్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది పాకిస్థాన్. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్న 20 రాజ్ బెటాలియన్‌ను స్వాధీనం చేసుకున్నామని పాక్ బిల్డప్ ఇచ్చింది. అలాగే భారత మిలటరీ సన్నాహాలకు సంబంధించి ఆర్మీ నుంచి వచ్చిన లేఖ అంటూ మరో పోస్ట్‌ను పాక్ వైరల్ చేస్తోంది. అంబాలా ఎయిర్ బేస్ నుంచి అమృత్‌సర్ నగరంపై అలాగే తన సొంత పౌరులపై ఇండియా దాడులు చేస్తోందంటూ అర్థంపర్థం లేని రూమర్స్ పుట్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా అనేక ఫేక్ పోస్ట్‌లు, తప్పుడు కథనాలతో యుద్ధంలో తమదే పైచేయి అని ప్రచారం చేసుకుంటోంది. అయితే వాస్తవంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ వ్యాప్తి చేస్తున్న ఫేక్ న్యూస్‌ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా వాళ్లకు చెంపచెళ్లుమనేలా చేసింది.
అస్సలు నమ్మొద్దు
రాజౌరి సూసైడ్ నుంచి జలంధర్‌పై డ్రోన్ అటాక్ వరకు ప్రతిదీ ఫేక్ అని తేల్చేసింది పీఐబీ ఫ్యాక్ట్ చెక్. ఈ వీడియోలు, ఫొటోలు ఎక్కడివి, ఎప్పటివి అనేది క్లారిటీ ఇస్తూ పాక్ ఫేక్ ప్రాపగండాను అందరి ముందు బయటపెట్టింది ఇండియా. ఇవన్నీ ఫేక్ న్యూస్‌లు అని.. వీటిని అస్సలు నమొద్దని పౌరులను కోరింది ప్రెస్ ఇండియా బ్యూరో. దీంతో యుద్ధం చేతగాకే పాక్ ఇలాంటి చెత్త, పిరికి పనులు చేస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. దమ్ముంటే యుద్ధం చేయాలని, ఇలా రాంగ్ ఇన్‌ఫర్మేషన్‌ను వైరల్ చేస్తే పరువు పోగొట్టుకోవడం తప్పితే పాక్‌కు లాభం లేదని కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లకు ఈ జన్మలో బుద్ధి రాదంటూ ఫైర్ అవుతున్నారు.
ఇవీ చదవండి:
ఆపరేషన్ సిందూర్‌పై బాలీవుడ్‌లో వార్
భారత్, పాక్ యుద్ధం.. కిమ్ సపోర్టు ఎవరికి..
పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 09 , 2025 | 10:54 AM