Pakistan Vs India: పాకిస్థాన్‌కు గట్టిగా బదులిస్తున్న భారత్
ABN, Publish Date - May 02 , 2025 | 08:25 AM
Pakistan Vs India: భారత్‌పై పాక్ కవ్వింపు చర్యలను కొనసాగిస్తుంది. అందులోభాగంగా ఏనిమిదో రోజు గురువారం రాత్రి సైతం భారత్ భూభాగంపైకి కాల్పులు జరిపింది. ఈ కాల్పులకు ధీటుగా భారత్ సమాధానమిచ్చింది.
న్యూఢిల్లీ, మే 02: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై తీవ్ర ఆంక్షలు విధించినా.. భారత్‌పై తన కవ్వింపు చర్యలను మాత్రం ఆ దేశం ఆపడం లేదు. వరుసగా ఎనిమిదో రోజు గురువారం రాత్రి సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారత్ భూభాగంపైకి పాక్ సైన్యం కాల్పులు జరిపింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషారా, అక్నూరు సెక్టర్లలో పాక్ సైన్యం ఈ కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం ఎప్పుడు కాల్పులు జరిపినా.. అందుకు ధీటుగా భారత సైన్యం వెంటనే స్పందించి తగిన రీతిలో జవాబు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కాల్పుల ద్వారా కవ్వింపు చర్యలపై భారత్ అధికారులు ఇప్పటికే పాక్ అధికారులతో హాట్ లైన్‌లో మాట్లాడారు. అయినా పాక్ మాత్రం తన వైఖరిని ఏ మాత్రం వీడడం లేదు. తన ధోరణిలోనే పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ ఘటన వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనేందుకు స్పష్టమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. దీంతో పాకిస్థాన్‌పై భారత్ పలు ఆంక్షలు విధించింది. పాక్ సైతం అదే రీతిలో స్పందించి.. భారత్‌పై ఆంక్షలు విధించింది. దాంతో ఇరుదేశాల మధ్య ఓ విధమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉగ్రదాడి జరిగిన కొద్దిరోజులకే నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోని సైనికుల పోస్టులే లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ కాల్పులు జరుపుతోంది.
అయితే ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని భారత సైన్యం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విధితమే. మరోవైపు లష్కరే తోయిబా చీఫ్ హాఫీజ్ సయిద్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేసింది. పహల్గాం ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంన్స్ ఫ్రంట్ ఉన్నట్లు ఇప్పటికే ఆ సంస్థ ప్రకటించింది. దీంతో ఈ ఉగ్రదాడిలో హాఫీజ్ సయిద్ పాత్ర కీలకమని భారత్ గాఢంగా విశ్వసిస్తోందని పాక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అతడికి భద్రతను కట్టుదిట్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Ambulance: అంబులెన్స్‌లో ఏం తరలిస్తున్నారో తెలిస్తే.. షాక్ అవాక్కవాల్సిందే..
Pahalgam Terror Attack: హఫీజ్ సయిద్ భద్రత పెంచిన పాక్
For National News And Telugu News
Updated Date - May 02 , 2025 | 08:31 AM