ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: 200 మంది ఉగ్రవాదుల్ని లేపేశారు.. మహిళా పైలట్లకు బిగ్ సెల్యూట్!

ABN, Publish Date - May 24 , 2025 | 06:42 PM

ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ఒక్కొక్కటిగా నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. భారత మహిళా పైలట్లు శత్రుదేశానికి చుక్కలు చూపించారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఏకంగా 200 మందిని లేపేశారని పేర్కొన్నాయి. దీని గురించి మరింతగా చూద్దాం..

Operation Sindoor

పహల్గాం దాడితో అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్‌తో గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. 9 ఉగ్రస్థావరాలపై అటాక్ చేసి 100 మందికి పైగా టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఆ తర్వాత ఎదురుదాడికి దిగిన పాకిస్థాన్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించారు మన సైనికులు. డ్రోన్లు, క్షిపణులతో పాక్ ఆర్మీ పోస్టులు, ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశారు. దీంతో భయపడ్డ పాక్.. కాల్పులు ఆపండి మహాప్రభో అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. ఇప్పుడు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆపరేషన్ సిందూర్ ముగిసిందని చాలా మంది అనుకుంటున్నారు. అయితే మన సైనికుల వీరగాథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మే 7వ తేదీన జరిపిన దాడిలో భారత మహిళా పైలట్లు ఏకంగా 200 మందికి పైగా టెర్రరిస్టులను లేపేశారని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. వీరిలో 170 మంది టెర్రరిస్టులు, 42 మంది శత్రుదేశ సైనికులు ఉన్నట్లు స్పష్టం చేశాయి.


వారిదే ప్రధాన పాత్ర!

పాకిస్థాన్‌లోని కీలక ఉగ్రస్థావరాలు ముఖ్యంగా బహవల్‌పూర్‌‌లోని జైషే మహ్మద్ టెర్రర్ క్యాంప్ పూర్తిగా ధ్వంసమైందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాది మౌలానా మసూద్ అజహర్ కుటుంబంలోని చాలా మంది హతమయ్యారని పేర్కొంది. ఈ వైమానిక దాడుల్లో భారత మహిళా పైలట్లు కీలక పాత్ర పోషించారని వివరించింది. బ్రహ్మోస్ క్షిపణులు అద్భుతంగా పని చేశాయని స్పష్టం చేసింది. మే 7న జరిపిన దాడులతో పాటు మే 9, 10 తేదీల్లో పాకిస్థాన్‌లోని సర్దోదా, రహీం యార్ ఖాన్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లపై జరిపిన దాడుల్లోనూ భారత మహిళా పైలట్ల పాత్ర ఎంతో కీలకమని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో మహిళా పైలట్ల మీద ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. వారికి బిగ్ సెల్యూట్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇదీ ఇండియా పవర్ అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని అధికారిక వర్గాలు చెప్పాయి. భద్రతా బలగాలు ఇంకా హైఅలర్ట్‌లో ఉన్నాయని వెల్లడించాయి.


ఇవీ చదవండి:

ఉల్ఫా ఆపరేషనల్ కమాండర్ అరెస్టు

సౌండ్ తగ్గించమన్నందుకు దారుణం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 24 , 2025 | 06:48 PM