Chennai: ఎమ్మెల్యే అయితేనేం.. రూలంటే రూలేమరి..
ABN, Publish Date - May 24 , 2025 | 02:00 PM
హెల్మెట్ ధరించని కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పోలీసులు జరిమానా విధించారు. తమిళనాడు రాష్ట్రం విలవంగోడు మహిళా ఎమ్మెల్యే తారకై కుత్బర్ట్ హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపారంటూ పోలీసులు ఆమెకు జరిమానా విధించారు.
- హెల్మెట్ ధరించని ఎమ్మెల్యేకు జరిమానా..
చెన్నై: ద్విచక్రవాహనంపై హెల్మెట్ లేకుండా వెళ్లిన మహిళా ఎమ్మెల్యేకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేది కన్నియాకుమారి జిల్లా పంగల్ జంక్షన్ నుంచి కుళిత్తురై జంక్షన్ వరకు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కిల్లియూర్ ఎమ్మెల్యే రాజేష్‌కుమార్, విలవంగోడు మహిళా ఎమ్మెల్యే తారకై కుత్బర్ట్ సహా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
కాగా, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే తారకై కుత్బర్ట్ సహా కొందరు హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనంపై కాంగ్రెస్ జెండా ఉంచి పాల్గొన్నారు. ఈ క్రమంలో, హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనంపై వెళ్లిన మహిళా ఎమ్మెల్యేకు ట్రాఫిక్ పోలీసులు రూ.1,000 జరిమానా విధించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..
Kaleshwaram: కాళేశ్వరంలో నవరత్న మాల హారతి!
Read Latest Telangana News and National News
Updated Date - May 24 , 2025 | 02:00 PM