Share News

Kaleshwaram: కాళేశ్వరంలో నవరత్న మాల హారతి!

ABN , Publish Date - May 24 , 2025 | 04:44 AM

కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతి నది పుష్కరాలకు శుక్రవారం భక్తులు పోటెత్తారు.

Kaleshwaram: కాళేశ్వరంలో నవరత్న మాల హారతి!

  • ఏకాదశి సందర్భంగా కాశీ వేదపండితుల నిర్వహణ

  • 9వ రోజు సరస్వతి పుష్కరాలకు 1.30 లక్షల మంది భక్తులు

భూపాలపల్లి, మే 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతి నది పుష్కరాలకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఏకాదశి కావడంతో కాశీ నుంచి వచ్చిన వేద పండితులు కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో ప్రత్యేకంగా నవరత్న మాల హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హంపి పీఠాధిపతి విరుపాక్ష విద్యారణ్య స్వామీజీ 9వ రోజు పుష్కర కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై సరస్వతి నదిలో పుణ్యస్నానం చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.


శుక్రవారం 1.3 లక్షల మంది భక్తులు తరలిచ్చి పుణ్యస్నానాలు చేశారు. వర్షంతో వాహనాలు బురదలో దిగబడే ప్రమాదం ఉండటంతో అన్నారం క్రాస్‌ నుంచి పూస్కుపల్లి మీదుగా ప్రైవేటు వాహనాలను కాళేశ్వరం పార్కింగ్‌ స్థలాలకు మళ్లించారు. ఉదయం దాదాపు రెండు గంటల పాటు పుస్కుపల్లి వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినా అధికారులు స్పందించి క్రమబద్ధీకరించారు.

Updated Date - May 24 , 2025 | 04:44 AM