Covid: రాష్ట్రంలో.. కరోనా వ్యాప్తి లేదు..
ABN, Publish Date - May 21 , 2025 | 01:57 PM
రాష్ట్రంలో.. కరోనా వ్యాప్తి లేదని, ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు సెల్వ వినాయగం వెల్లడించారు. కరోనా కేసులు నమోదుకాకున్నా.. ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్, నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయిలాండ్ తదితర దేశాల్లో కరోనా వ్యాప్తి అతి తక్కువగా ఉందన్నారు.
ఆరోగ్య శాఖ డైరెక్టర్ వెల్లడి
చెన్నై: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని, ప్రజలు భయాందోళనలకు చెందొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు సెల్వ వినాయగం(Selwa Vinayagam) పేర్కొన్నారు. 2022 తర్వాత ప్రభుత్వ చర్యల ఫలితంగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టామన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందన్నారు. ఒక వేళ ఎవరైనా వైరస్ బారినపడితే వారిలో కూడా పెద్దగా ఈ లక్షణాలు కనిపించడం లేదన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: వేలూరులో టీవీకే రెండో బూత్ కమిటీ మహానాడు
పైగా దేశంలో ఈ యేడాది కరోనా వైరస్ బారినపడి ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికలో కూడా దక్షిణాసియా దేశాలైన భారత్, నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయిలాండ్ తదితర దేశాల్లో కరోనా వ్యాప్తి అతి తక్కువగా ఉన్నట్టు పేర్కొంది.
వియత్నాం, సింగపూర్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి తగ్గినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి చాలా తక్కువగానే ఉందన్నారు. అదేసమయంలో మన రాష్ట్రంలో కూడా ఈ వైరస్ వ్యాప్తి గణనీయంగా తక్కువగా ఉందని, అందువల్ల ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
నల్లమల సంపదపై రేవంత్ కన్ను: బీఆర్‌ఎస్
దేశసేవకు వెళ్లి.. విగతజీవిగా ఇంటికి..
పటాన్‌చెరు- ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టాలి
Read Latest Telangana News and National News
Updated Date - May 21 , 2025 | 03:22 PM