ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Monsoon Forecast: 16 ఏళ్ల తర్వాత దేశంలో మే 27 నాటికే వర్షాలు.. ఎక్కడెక్కడ ఎప్పుడంటే..

ABN, Publish Date - May 14 , 2025 | 05:06 PM

ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు నైరుతి రుతుపవనాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి వర్షాలు 16 ఏళ్ల తర్వాత త్వరగా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Monsoon Arrives Early India

దేశంలో వర్షాకాలం కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు. ఇది వ్యవసాయ రంగానికి జీవనాడి. ఈ క్రమంలో 2025లో నైరుతి రుతుపవనాలు (Monsoon Forecast) చాలా ముందుగా వస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రుతుపవనాలు 16 సంవత్సరాల తర్వాత మే 27 నాటికే కేరళ తీరానికి చేరుకుంటాయని ప్రకటించారు. ఇది దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ రంగంతోపాటు సామాన్య ప్రజలకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. దేశంలో దాదాపు 60% వ్యవసాయం వర్షాధారితం. రుతుపవనాలు సమయానికి, సరైన పరిమాణంలో వస్తే, పంటల దిగుబడి పెరిగి, ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.


16 ఏళ్ల తర్వాత ముందుగా..

సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. కానీ ఈ సంవత్సరం, 16 సంవత్సరాల తర్వాత, మే 27 నాటికే కేరళలో రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయని చెబుతున్నారు. ఈ అరుదైన సంఘటన చివరిసారిగా 2009లో జరిగింది. రుతుపవనాలు ముందుగానే రావడం వల్ల దక్షిణ భారతంలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు త్వరగా మొదలవుతాయి. ఇది వ్యవసాయ కార్యకలాపాలకు, ముఖ్యంగా వరి, చెరకు, కాఫీ, తేయాకు వంటి పంటలకు అనుకూలంగా ఉంటుంది. అయితే రాష్ట్రాల ప్రకారం చూస్తే ఏ ప్రాంతాల్లో ఎప్పుడు నైరుతి రుతుపవనాలు వస్తాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


2025 నైరుతి రుతుపవనాల రాక అంచనా

రాష్ట్రం- అంచనా రాక తేదీ

  • అండమాన్ నికోబార్ దీవులు - మే 13, 2025

  • కేరళ - మే 27, 2025

  • కర్ణాటక - 1-2 జూన్ 2025

  • తమిళనాడు - 3-5 జూన్ 2025

  • ఆంధ్రప్రదేశ్ - 30 మే - 1 జూన్ 2025

  • తెలంగాణ - 4-6 జూన్ 2025

  • మహారాష్ట్ర - 7-10 జూన్ 2025

  • గోవా - 5-7 జూన్ 2025

  • గుజరాత్ - జూన్ 15, 2025

  • మధ్యప్రదేశ్ - 15-18 జూన్ 2025

  • ఛత్తీస్‌గఢ్ - 12-15 జూన్ 2025

  • ఒడిశా - 10-12 జూన్ 2025

  • పశ్చిమ బెంగాల్- 12-14 జూన్ 2025

  • జార్ఖండ్ - 14-16 జూన్ 2025

  • బీహార్ - 15-17 జూన్ 2025

  • ఉత్తర ప్రదేశ్ - 18-20 జూన్ 2025

  • ఢిల్లీ- 25-27 జూన్ 2025

  • హర్యానా- 26-28 జూన్ 2025

  • పంజాబ్- 27-29 జూన్ 2025

  • రాజస్థాన్- 20-25 జూన్ 2025

  • హిమాచల్ ప్రదేశ్- 28-30 జూన్ 2025

  • ఉత్తరాఖండ్-26-28 జూన్ 2025

  • జమ్మూ కాశ్మీర్-30 జూన్ - 2 జూలై 2025

  • సిక్కిం-10-12 జూన్ 2025

  • అసోం- 10-12 జూన్ 2025

  • మేఘాలయ-11-13 జూన్ 2025

  • మణిపూర్-12-14 జూన్ 2025

  • మిజోరం - 13-15 జూన్ 2025

  • త్రిపుర-14-16 జూన్ 2025

  • నాగాలాండ్- 13-15 జూన్ 2025

గమనిక: పై తేదీలు తాత్కాలికంగా వాతావరణ శాఖ సూచనలపై ప్రకటించినవి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఈ తేదీలు మారే అవకాశం ఉంది.


రుతుపవనాలు ప్రస్తుతం ఎక్కడ..

IMD ప్రకారం, మే 13, 2025 నాటికి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి అవి నెమ్మదిగా దక్షిణ భారతదేశం వైపు కదులుతున్నాయి. రుతుపవనాల వేగం సాధారణం కంటే వేగంగా ఉంది. దీని కారణంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలలో మే చివరి వారంలోనే వర్షాలు ఆరంభమయ్యే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

Bhargavastra: ఆకాశంలో శత్రు డ్రోన్‌లను నాశనం చేసే స్వదేశీ 'భార్గవస్త్ర' పరీక్ష సక్సెస్

Penny Stock: ఈ స్టాక్‎పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..


Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 14 , 2025 | 05:10 PM