ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: ఇది గర్వించే సమయం... ఆపరేషన్‌ సిందూర్‌పై మోదీ

ABN, Publish Date - May 07 , 2025 | 02:29 PM

భారత బలగాలు కచ్చితమైన లక్ష్యాలు ఛేదించడం మనమంతా గర్వించదగని విషయం అని మోదీ చెప్పగానే క్యాబినెట్ సభ్యులు హర్షధ్వానాలు వ్యక్తం చేసారు. ఆపరేషన్ వ్యూహాత్మకంగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరక్కుండా కచ్చితంగా అమలు చేశారని ప్రధాని వివరించారు.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా పాక్‌లోని ఉగ్రస్థావరాలు టార్గెట్‌గా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన క్యాబినెట్ సహచరులతో సమావేశమయ్యారు. ''ఇది మనమంతా గర్వించదగిన సమయం'' అని అభివర్ణించారు. సాయుధ బలగాలు కచ్చితమైన లక్ష్యాలపై దాడులు జరిపారంటూ ప్రశంసించారు. పాకిస్థాన్ లోపలకు చొచ్చుకెళ్లి పంజాబ్ ప్రావిన్స్‌లో 4 చోట్ల, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 5 చోట్లు సాయుధ బలగాలు దాడులు జరిపిన తీరును ఆయన వివరించారు.

Operation Sindoor: మోదీ విదేశీ పర్యటనలు వాయిదా, రేపు అఖిలపక్షం


భారత బలగాలు కచ్చితమైన లక్ష్యాలు ఛేదించడం మనమంతా గర్వించదగని విషయం అని మోదీ చెప్పగానే క్యాబినెట్ సభ్యులు హర్షధ్వానాలు వ్యక్తం చేసారు. ఆపరేషన్ వ్యూహాత్మకంగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరక్కుండా కచ్చితంగా అమలు చేశారని, ప్రతీకారదాడులు విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు. ముందస్తుగానే సమగ్రమైన సన్నాహకాలు చేసుకుని తూచ తప్పకుండా మిషన్ నిర్వహించిందన్నారు. ఆర్మీ ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించిందని మోదీ ప్రశంసించారు. యావద్దేశం మనవైపు చూస్తోందని, ఆర్మీ మనకు గర్వకారణంగా నిలిచిందని అన్నారు.


ఏప్రిల్ 22న హహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ముందుకు నడిపించిన మోదీ సారథ్యాన్ని మంత్రులంతా ఈ సందర్భంగా ప్రశంసించారు. కాగా, ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తీరు, పరిణామాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొద్దికేపటి క్రితం కలుసుకున్నారు.


ఇవి కూడా చదవండి:

ఆపరేషన్ సిందూర్‌లో వాడిన ఈ మిసైల్స్ గురించి తెలుసా

పాక్‌‌పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభం.. 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు

రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Read Latest and National News

Updated Date - May 07 , 2025 | 02:35 PM