Operation Sindoor: పాక్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రారంభం.. 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు
ABN , Publish Date - May 07 , 2025 | 07:33 AM
పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పీఓకేతో పాటు పాక్ భూభాగంలోని పలు ఉగ్రస్థావరాలపై దీర్ఘశ్రేణి ఆయుధాలతో భారత్ భీకర దాడులు చేసింది.
పహల్గాం దాడికి బదులు తీర్చుకుంటామని హెచ్చరించిన భారత్.. పాక్‌పై భీకర దాడుల ప్రారంభించింది. ఉగ్రదాడిలో తమ జీవిత భాగస్వాములను కోల్పోయిన మహిళల కన్నీరు తుడిచేలా ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు భీకర దాడులు ప్రారంభించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు పాక్‌లోని నాలుగు ఉగ్రవాద శిబిరాలపై భారత్ మిసైళ్ల వర్షం కురిపించింది. లష్కరే తయ్యబా, జైష్ ఏ మహ్మద్, హిజ్బలు ముజాహిద్దీన్, ఇతర ఉగ్రసంస్థల స్థావరాలు టెర్రర్ నెట్వర్క్‌లు ధ్వంసం చేయడమే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజాము నుంచి మెరుపుదాడులకు దిగింది. బహావల్‌పూర్, మురిద్కే, కోట్లీ, గుల్‌పూర్, సవాయ్, సర్జాల్, బర్నాలా, మెహ్‌మూనా ప్రాంతాలపై దాడి దాడులకు దిగింది.
బహావల్‌పూర్‌లో జైష్ ఏ మహ్మద్ హెడ్‌క్వార్టర్స్ ఉంది. మురిద్కే లో లష్కరే తయ్యబా శిక్షన క్యాంపు ఉంది. కోట్లీలో సూసైడ్ బాంబర్ల శిక్షణ కార్యక్రమాలు సాగుతుంటాయి. గుల్‌పూర్‌లో నుంచి ఉగ్రవాదులు తరచూ పూంచ్, రాజౌలీలపై దాడులకు దిగుతుంటారు. సవాయ్, సర్జాల్, బర్నాలా, మెహ్‌మూనా వంటి ప్రాంతాలు ఉగ్రకార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నాయి.
ఈ దాడుల్లో భారత త్రివిధ దళాలు పాల్గొన్నాయి. దీర్ఘశ్రేణి ఆయుధాలతో అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాయి. ఈ దాడుల సమయంలో పాక్ పౌరులకు ఎలాంటి అపాయం లేకుండా జాగ్రత్తపడింది. పాక్ మిలిటరీ స్థావరాలపై కూడా దాడులు చేయలేదు. బుధవారం అర్ధరాత్రి 7.04 గంటలకు దాడులు ప్రారంభించింది. అంతకు కొద్ది గంటల ముందే ఆర్మీ నేవీ అన్నింటికి రెడీ అంటూ ట్వీట్ చేశాయి.
ఇవి కూడా చదవండి:
పాక్‌పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభం.. 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు
Security rill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Pakistan Army: బుద్ధి మార్చుకోని పాకిస్తాన్.. 12వ రోజు కూడా కవ్వింపు చర్యలు
Anurag Thakur: సరిహద్దుల్లో పేట్రేగితే పాక్‌ను నామరూపాల్లేకుండా చేస్తాం