ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India US Trade War: భారత్-అమెరికా సుంకాల వివాదం..మోదీ ఎమర్జెన్సీ మీటింగ్..

ABN, Publish Date - Aug 08 , 2025 | 12:37 PM

భారత్-అమెరికా మధ్య నెలకొన్న సుంకాల వివాదం నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కీలక సమావేశంలో అమెరికాతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, చర్యలపై లోతుగా చర్చించనున్నారు.

India US Trade War modi meeting

భారత్, అమెరికా దేశాల మధ్య సుంకాల విషయంలో చర్చ జోరుగా సాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ నుంచి వచ్చే వస్తువులపై మరో 25 శాతం సుంకం విధించారు. ఇప్పటికే ఉన్న 25 శాతంతో కలిపి ఇప్పుడు మొత్తం 50 శాతం సుంకం అయ్యింది. దీనికి ప్రధాన కారణం, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని ట్రంప్ అసహనం వ్యక్తం చేయడం.

ఈ విషయంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఎమర్జెన్సీ కేబినెట్ సమావేశం ఏర్పాటు (India US Trade War modi meeting) చేశారు. ఈ సమావేశంలో అమెరికాతో ఎలా ముందుకెళ్లాలి, ఏ వ్యూహం అవలంబించాలనే దానిపై చర్చించనున్నారు. వాణిజ్య సంబంధాల్లో పెరిగిన ఉద్రిక్తతలు, దేశ ఆర్థిక ప్రయోజనాల రక్షణ కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై మంత్రివర్గ సభ్యులతో ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడనున్నారని సమాచారం.

సుంకాల పెంపు ఎందుకు..

ఇండియాపై డొనాల్డ్ ట్రంప్ గురువారం నాడు సుంకాల విషయంలో సంచలన ప్రకటన చేశారు. సుంకాల విషయం పరిష్కారం కాక ముందు భారత్‌తో ఎలాంటి వాణిజ్య ఒప్పంద చర్చలు ఉండవని స్పష్టం చేశారు. ఇది భారత్‌కు పెద్ద షాక్‌ లాంటిది. మెుదటగా జులై 20 నుంచి అమెరికా 25 శాతం సుంకం విధించగా, ఇప్పుడు తాజాగా మరో 25 శాతం పెంచడం సంచలనం సృష్టిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. రష్యా నుంచి భారత్ చమురు కొనడం ట్రంప్‌కు నచ్చడం లేదు.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..

భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యను అన్యాయం, అసమంజసం అంటూ ఖండించింది. భారత్‌కు తన శక్తి అవసరాలు, వ్యూహాత్మక స్వాతంత్ర్యం ఉన్నాయని, వాటిని గౌరవించాలని అమెరికాకు సూచించింది. 50 శాతం సుంకాలు చిన్న విషయం కాకపోవడంతో మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

మోదీ రియాక్షన్

ప్రధాని మోదీ ఈ విషయంపై గట్టిగానే స్పందించారు. ఢిల్లీలో నిన్న జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సదస్సులో మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రైతులు, చేపల వ్యాపారులు, పాడి రంగంలో ఉన్నవారి ప్రయోజనాలను కాపాడతామన్నారు. దీనికి వ్యక్తిగతంగా ధర చెల్లించాల్సి వచ్చినా సిద్ధమని వెల్లడించారు. ఈ మాటలు మోదీ ఎంత ధైర్యంగా, దృఢంగా ఉన్నారో చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? లేక మారటోరియం తీసుకోవాలా?

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 08 , 2025 | 01:27 PM