ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: ఆధునిక యుగపు మీర్ జాఫర్.. రాహుల్‌పై బీజేపీ కౌంటర్ అటాక్

ABN, Publish Date - May 20 , 2025 | 05:39 PM

అపరేషన్ సింధూర్‌లో భారత్ ఎన్ని విమానాలు కోల్పోయిందో చెప్పాలంటూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్‌పై రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలను పాక్ తప్పుడు కథలు అల్లుకోవడానికి అస్త్రంగా మార్చుకుంటుందని అమిత్ మాలవీయ ఒక ట్వీట్‌లో విమర్శించారు.

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor) నిర్వహణకు సంబంధించి కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేస్తున్న వాఖ్యలపై బీజేపీ (BJP) మంగళవారంనాడు ఎదురుదాడి చేసింది. రాహుల్ గాంధీ పాకిస్థాన్ భాషలో మాట్లాడుతూ జాతి ప్రయోజనాలను బలహీన పరుస్తున్నారని విమర్శించింది. ఆయనను ఆధునిక యుగపు మీర్ జాఫర్ (Modern age Mir Jafar)గా అభివర్ణించింది. ఈ మేరకు బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. వలసవాద శక్తులకు దాసోహమై భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసిన వ్యక్తిగా మీర్ జాఫర్‌ను వ్యవహరిస్తారు.

Waqf Law: వక్ఫ్ చట్టంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు


ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఎన్ని విమానాలు కోల్పోయిందో చెప్పాలంటూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్‌పై రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలను పాక్ తప్పుడు కథలు అల్లుకోవడానికి అస్త్రంగా మార్చుకుంటుందని అమిత్ మాలవీయ ఆ ట్వీట్‌లో విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను గతంలో కూడా పాకిస్థాన్ ఉపయోగించుకుందని, ఇదేమీ కొత్త కాదని అన్నారు. రాహుల్ తరచు చేస్తున్న వ్యాఖ్యలు సరిహద్దు ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న పాకిస్థాన్‌ను సమర్ధించేలా ఉన్నాయని తప్పుపట్టారు.


రాహుల్ ఏమన్నారు?

ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన సమాచారాన్ని జైశంకర్ ముందుగానే పాక్‌కు చెప్పారని, ఇది ఆయనే స్వయంగా ఒప్పుకున్నారని రాహుల్ గాంధీ ఇటీవల వరుస విమర్శలు గుప్పించారు. జైశంకర్ మాట్లాడిన ఒక వీడియాను పోస్ట్ చేశారు. అదే వీడియోను రెండ్రోజుల క్రితం కూడా రీపోస్ట్ చేశారు. పాకిస్థాన్‌కు ముందే సమచారం ఇవ్వడం నేరమని, ఇందువల్ల భారత్ ఎన్ని విమానాలు కోల్పోయిందో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. తాను పదేపదే అడుగుతున్నా మంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. అయితే, జైశంకర్ పాక్‌కు ముందే సమాచారం ఇచ్చారన్న వ్యాఖ్యలను విదేశాంగ శాఖ ఇప్పటికే ఖండించింది. రాహుల్ వక్రభాష్యం చెబుతూ, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. బీజేపీ సైతం ఇప్పటికే పోస్టర్ వార్ మొదలుపెట్టింది. రాహుల్ గాంధీ ఫేస్‌ను పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునిర్ ఫేస్‌ను జతచేస్తూ ఇక ఫోటోను విడుదల చేసింది. పాకిస్థాన్ భాషలో మాట్లాడుతూ, దాయాది ప్రచారానికి రాహుల్ సహకరిస్తున్నారంటూ విమర్శించింది.


ఇవి కూడా చదవండి..

Shashi Tharoor: ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ ఎంపీ శశి థరూర్ లేఖ

Jyoti Malhotra Case: జ్యోతి మల్హోత్రా కేసులో కీలక అప్‎డేట్..యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 06:23 PM