Waqf Law: వక్ఫ్ చట్టంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - May 20 , 2025 | 04:34 PM
వక్ఫ్ చట్టంపై గత విచారణ సందర్భంగా, మూడు అంశాలపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయడానికి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. వాటిలో వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డులకు ముస్లిమేతరుల నామినేషన్, వక్ఫ్ కింద ప్రభుత్వ భూముల గుర్తింపు వంటివి ఉన్నాయి.
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టాన్ని (Waqf Law) సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాసితో కూడిన ధర్మాసనం మంగళవారంనాడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఆమోదించిన చట్టం రాజ్యాంగబద్ధమేననే భావన ఉందని, స్పష్టమైన సందర్భం వెల్లడి కానప్పుడు కోర్టులు జోక్యం చేసుకోకూడదని అన్నారు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు. అంతకన్నా తాము చెప్పవలసిన అవసరం లేదని చెప్పారు. వక్ఫ్‌ను స్వాధీనం చేసుకోవడం ఈ చట్టం ఉద్దేశమని పిటిషనర్ల తరఫు లాయర్ కపిల్ సిబాల్ అన్నప్పుడు సీజేఐ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Operation Sindoor: పఠాన్ ఔట్.. అభిషేక్ ఇన్
వక్ఫ్ చట్టంపై గత విచారణ సందర్భంగా, మూడు అంశాలపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయడానికి వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. వాటిలో వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డులకు ముస్లిమేతరుల నామినేషన్, వక్ఫ్ కింద ప్రభుత్వ భూముల గుర్తింపు వంటివి ఉన్నాయి. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించమని, ఈ మూడు అంశాలపై వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టుకు గత విచారణలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కాగా, మంగళవారంనాడు విచార సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, వక్ఫ్ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి విచారణను మూడు అంశాలకే పరిమితం చేయాలని కోరారు. కోర్టు గుర్తించిన మూడు అంశాలకు తాము సమాధాం దాఖలు చేశామన్నారు. అయితే ఇప్పుడు పిటిషనర్ల లిఖిత పూర్వక సమాధానాలు ఇతర అంశాలను ప్రస్తావించాయని, విచారణను ఈ మూడు అంశాలకే పరిమితం చేయాలని కోరారు.
అభ్యంతరం తెలిపిన సిబాల్, సింఘ్వి
ఇందుకు పిటిషనర్ల తరఫు హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి అభ్యంతరం తెలిపారు. ఈ కేసును విచారించి, మధ్యంతర ఉపశమనం ఎక్కడ ఇవ్వచ్చో పరిశీలిస్తామని గత సీజేఐ (సంజీవ్ ఖాన్నా) చెప్పారని, అందువల్ల కేవలం మూడు అంశాలకే తాము పరిమితమవుతామని చెప్పలేమని అన్నారు. వక్ఫ్ భూములను లాక్కోవడానికే చట్టం తెచ్చారని సిబాల్ వాదించారు. ఎలాంటి ప్రక్రియ లేకుండా వక్ఫ్ ఆస్తులను లాక్కోవడమే చట్టం ఉద్దేశమన్నారు. వక్ఫ్‌ను క్రియేట్ చేయాలంటూ ఒక వ్యక్తి కనీసం ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే షరతును సిబాల్ ప్రస్తావించారు. ''నేను మరణశయ్యపై ఉండి వక్ఫ్ ఏర్పాటు చేయాలనుకుంటుంటే ముస్లింగా ఉన్నట్టు ప్రూవ్ చేసుకోవాలి. ఇది రాజ్యాంగ విరుద్ధం'' అని అన్నారు. ఇది ఖచ్చితంగా వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకునే చట్టమేనని వాదించారు.
సీజేఐ ఇందుకు స్పందిస్తూ, పార్లమెంటులో ఆమోదించిన చట్టానికి రాజ్యాంగబద్ధత ఉంటుందని, స్పష్టమైన సందర్భం వెల్లడికానప్పుడు కోర్టులు జోక్యం చేసుకోలేవని అన్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితిలో ఇంతకంటే తాము ఏమీ చెప్పాలనుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Shashi Tharoor: ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ ఎంపీ శశి థరూర్ లేఖ
Jyoti Malhotra Case: జ్యోతి మల్హోత్రా కేసులో కీలక అప్డేట్..యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి