ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kisan Vikas Patra: కిసాన్ వికాస్ పత్ర.. భద్రమైన పొదుపు, రెట్టింపు లాభాలు..

ABN, Publish Date - Jun 22 , 2025 | 07:18 PM

కిసాన్ వికాస్ పత్ర (KVP) అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకం. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తం దాదాపు 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Kisan Vikas Patra

Kisan Vikas Patra: భవిష్యత్తుకు ఆర్థికంగా భద్రత కావాలనుకుంటే ప్రభుత్వ పాలసీలు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. అందులో కిసాన్ వికాస్ పత్ర (KVP) స్కీం ఒకటి. ఈ పథకాన్ని ఇండియా పోస్టు విభాగం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ స్కీం ముఖ్యంగా గ్రామీణ ప్రజలలో పొదుపు అలవాటు పెంచడం, అలాగే భవిష్యత్తుకు స్థిర ఆదాయ వనరులు కల్పించడం లక్ష్యంగా రూపొందించారు.

కిసాన్ వికాస్ పత్ర

కిసాన్ వికాస్ పత్ర (KVP) అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకం. ఇది దీర్ఘకాలిక పొదుపు కోసం ఒక సర్టిఫికెట్ పథకం. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తం దాదాపు 9 సంవత్సరాల 7 నెలల్లో (115 నెలలు) రెట్టింపు అవుతుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1988, ఏప్రిల్ 1న ప్రారంభించింది. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1,000. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. పెట్టుబడి పెట్టిన మొత్తం దాదాపు 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. SBI నివేదిక ప్రకారం ప్రస్తుతం వడ్డీ రేటు 7.5% గా ఉంది. (తాజా అప్‌డేట్ కోసం పోస్టాఫీస్ వెబ్‌సైట్ చూడవచ్చు).

పెట్టుబడి రకాలు:

  • సింగిల్ హోల్డింగ్ టైప్: వ్యక్తిగత పేరుతో సర్టిఫికెట్ పొందవచ్చు.

  • ఏ టైప్ జాయింట్ సర్టిఫికెట్: ఇద్దరు వ్యక్తులు కలిపి పెట్టుబడి పెట్టొచ్చు. ఇద్దరికీ లాభం వస్తుంది.

  • బీ టైప్ జాయింట్ సర్టిఫికెట్: ఒకరి మృతి చెందితే రెండో వ్యక్తికి మొత్తం లాభం ఉంటుంది.

ఎక్కడ దరఖాస్తు చేయాలి?

  • మీ సమీప పోస్టాఫీస్ లేదా LIC బ్రాంచ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఆధార్, పాన్ కార్డ్ వంటి KYC డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.

  • నిర్దిష్ట కాలానికి డబ్బు పెట్టుబడి చేసి రెట్టింపు చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్.

  • దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.

  • గ్రామీణులకే కాకుండా పట్టణాల వారికీ కూడా ఇది ఒక మంచి ఆప్షన్.

  • ఖచ్చితమైన రాబడి హామీ.

  • పన్ను ఆదా చేసే అవకాశం లేదు. కానీ ఉపసంహరణ సమయంలో TDS మినహాయింపు ఉంటుంది.

  • ఈ పథకం ముఖ్యంగా రైతుల కోసం ప్రారంభించారు. కానీ, ఇప్పుడు అందరూ దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

జీవితాంతం నెలకు 20,000 పొందాలనుకుంటున్నారా.. ఈ ప్లాన్‌ను తప్పక తెలుసుకోండి..

నక్సల్స్‌ను వర్షాకాలంలోనూ నిద్రపోనీయం: అమిత్‌షా

For More National News

Updated Date - Jun 22 , 2025 | 07:55 PM