Money Savings: జీవితాంతం నెలకు 20,000 పొందాలనుకుంటున్నారా.. ఈ ప్లాన్‌ను తప్పక తెలుసుకోండి..
ABN , Publish Date - Jun 22 , 2025 | 06:53 PM
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక ప్లాన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. పెన్షన్ ప్లాన్‌కు సంబంధించి..
మీరు భవిష్యత్తులో ఆర్థికంగా ఒత్తిడి లేకుండా, మానసికంగా ప్రశాంతంగా జీవించాలనుకుంటే, LIC జీవన్ ఉత్సవ్ పాలసీ ఒక మంచి ఎంపిక. జీవన్ ఉత్సవ్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అందించే ఒక ప్రత్యేకమైన బీమా పథకం. ఇది జీవితాంతం ఆదాయాన్ని అందించే పథకం. ఈ పాలసీలో, మీరు ఒక నిర్దిష్ట కాలం పాటు ప్రీమియం చెల్లించిన తర్వాత, జీవితాంతం ఒక నిర్దిష్ట మొత్తాన్ని ఆదాయంగా పొందుతారు.
జీవన్ ఉత్సవ్ పాలసీ ప్లాన్
మీరు 5 నుండి 16 సంవత్సరాల మధ్య ప్రీమియం చెల్లించే వ్యవధిని ఎంచుకోవచ్చు.
ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత, జీవితాంతం ఒక నిర్దిష్ట మొత్తాన్ని ఆదాయంగా పొందుతారు. ప్రతి ఏడాది సమ్ అస్యూర్డ్ మీద 10% చొప్పున ఆదాయం ఉంటుంది.
ఈ పాలసీ ద్వారా వందేళ్ల వయసు వచ్చే వరకు మీరు ఈ వార్షిక చెల్లింపులను పొందుతారు.
సంవత్సరానికి రూ. 2.5 లక్షల ఆదాయం పొందవచ్చు. అంటే.. నెలకు సుమారుగా రూ. 20,000 వరకు వస్తుంది.
ఈ పథకం మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను కూడా అందిస్తుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే, నామినీకి బీమా మొత్తం అందుతుంది.
మీరు రెగ్యులర్ ఆదాయం లేదా ఫ్లెక్సీ ఆదాయం ఎంపికలలో ఒకదానిని ఎంచుకోవచ్చు.
పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంది.
జీవన్ ఉత్సవ్ పథకంలో చేరడానికి అర్హత:
కనీస వయస్సు: 90 రోజులు
గరిష్ట వయస్సు: 65 సంవత్సరాలు
కనీస బీమా మొత్తం: 5 లక్షల రూపాయలు
జీవన్ ఉత్సవ్ పథకం ప్రయోజనాలు:
జీవితాంతం ఆదాయం పొందవచ్చు
కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది
పన్ను ఆదా చేసుకోవచ్చు.
వెయిటింగ్ పీరియడ్ వివరాలు:
ప్రీమియం చెల్లింపు కాలాన్ని బట్టి వెయిటింగ్ పీరియడ్ మారుతుంది. 5 సంవత్సరాల వ్యవధి ఎంపిక చేస్తే అదనంగా మరో 5 సంవత్సరాలు వేచి ఉండాలి. 6 సంవత్సరాల టర్మ్ ఎంపిక చేస్తే అదనంగా మరో 4 సంవత్సరాలు వేచి ఉండాలి. 7 సంవత్సరాలు ఎంపిక చేస్తే అదనంగా మరో 3 సంవత్సరాలు వేచి ఉండాలి. 8–16 సంవత్సరాల వ్యవధి ఎంపిక చేస్తే అదనంగా మరో 2 సంవత్సరాలు వేచి ఉండాలి.
కనీస 'సమ్ అస్యుర్డ్':
LIC ప్రకారం, ఈ పాలసీకి కనీసంగా రూ. 5 లక్షలు సమ్ అస్యూర్డ్ గా ఉండాలి.
మీరు జీవన్ ఉత్సవ్ పథకం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే, LIC వెబ్సైట్ లేదా LIC ఏజెంట్ ను సంప్రదించండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
కళ్లలో దుమ్ము పడితే ఏం చేయాలి? ఏం చేయకూడదు?
శరీర దుర్వాసనతో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే తక్షణ ఫలితం
For More Lifestyle News