Karnataka: సీఎం మార్పు అధిష్ఠానం చేతుల్లో!
ABN, Publish Date - Jul 01 , 2025 | 05:35 AM
కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఖర్గే స్పందించారు. అలాంటి అంశాలపై అధిష్ఠానం మాత్రమే నిర్ణయం తీసుకుందన్నారు.
కర్ణాటక నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్పష్టం
ఖర్గే కాకుంటే.. ఇంకెవరు హైకమాండ్?: బీజేపీ
బెంగళూరు, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఖర్గే స్పందించారు. అలాంటి అంశాలపై అధిష్ఠానం మాత్రమే నిర్ణయం తీసుకుందన్నారు. ‘అనవసర సమస్యలు’ సృష్టించవద్దని పార్టీ నేతలకు హెచ్చరికలు చేశారు. ఖర్గే సోమవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. అక్టోబరులో రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉంటుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘చూడండి, అది హైకమాండ్ చేతుల్లో ఉంటుంది. అధిష్ఠానంలో ఏం జరుగుతుందో ఇక్కడ ఎవరూ చెప్పలేరు. తదుపరి ఏ చర్య అయినా తీసుకొనే అధికారం వారికే ఉంటుంది’ అన్నారు.
ఖర్గే వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ నేత అశోక్ స్పందించారు. ఖర్గేకు కాంగ్రెస్ పార్టీకి యాక్సిడెంటల్‌గా అధ్యక్షుడు అయ్యారని వ్యాఖ్యానించారు. ‘‘పార్టీ అధ్యక్షుడు హైకమాండ్ కాకుంటే.. ఇంకెవరు’’ అని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ప్రశ్నించారు. మరోవైపు ప్రభుత్వంలో చీలిక ఉందనే ప్రచారాన్ని సీఎం సిద్దరామయ్య కొట్టిపారేశారు. తమ ప్రభుత్వం రాయిలాగా ఐదేళ్లు ధ్రుడంగా ఉంటుందన్నారు. ఓ కార్యక్రమంలో శివకుమార్‌తో చేతులు కలిపి, పైకెత్తి ఐక్యతను చాటారు.
Updated Date - Jul 01 , 2025 | 05:35 AM