ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Slap Fight: చెంపలు పగిలేగా కొట్టుకున్న బీజేపీ నేత, పోలీస్ ఆఫీసర్.. వీడియో వైరల్

ABN, Publish Date - Mar 15 , 2025 | 07:56 PM

దుర్గాడ సిరి హోటల్ వద్ద కొందరు వ్యక్తులు అర్థరాత్రి సమయంలో గుమిగూడారు. దీంతో అటువైపు వెళ్తున్న పోలీసు వాహనం అక్కడ ఆగింది. అక్కడి నుంచి అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలని సబ్ ఇన్‌స్పెక్టర్ గాడిలింగ గౌడర్ కోరారు.

బెంగళూరు: ఒకరు రాజకీయ నేత, మరొకరు పోలీసు అధికారి.. వీరి మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరూ కలబడ్డారు. ఒకరు చెంపలు మరొకరు వాయిస్తూ కొట్టుకున్నారు. వారిని ఆపేందుకు ప్రయత్నించిన వారిని పక్కకు నెట్టేస్తూ మళ్లీ మళ్లీ కలబడ్డారు. బెంగళూరుకు 270 కిలోమీటర్ల దూరంలోని చిత్రదుర్ఘలో ఈ 'స్లాప్ ఫైట్' జరగడం, ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో రావడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

Tej Pratap: డాన్స్ చేస్తావా? సస్పెండ్ చేయనా?.. పోలీసుకు తేజ్ ప్రతాప్ హుకుం


దుర్గాడ సిరి హోటల్ వద్ద కొందరు వ్యక్తులు అర్థరాత్రి సమయంలో గుమిగూడారు. దీంతో అటువైపు వెళ్తున్న పోలీసు వాహనం అక్కడ ఆగింది. అక్కడి నుంచి అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలని సబ్ ఇన్‌స్పెక్టర్ గాడిలింగ గౌడర్ కోరారు. అక్కడే ఉన్న మధుగిరి బీజేపీ జిల్లా అధ్యక్షుడు హనుమంత గౌడ పోలీసు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలం వాడుతూ మీదమీదకు రావడంతో ఆయన చెంపపై ఎస్ కొట్టారు. హనుమంత గౌడ తిరిగి కొట్టడంతో వారి మధ్య గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది.


కాగా, హోటల్‌లో భోజనం చేసి తిరిగి వెళ్లేందుకు తాము సిద్ధపడుతుండగా అక్కడ పోలీసు అధికారి వచ్చి పరుషపదజాలంతో హనుమంత గౌడను తిట్టినట్టు ఆయన కారు డ్రైవరు తెలిపాడు. దాంతో హనుమంత గౌడ కూడా ఘాటుగా మాట్లాడటం, ఇద్దరూ కలబడటం జరిగిందని చెప్పారు. దీనిపై చిత్రదుర్గ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.


ఇవి కూాడ చదవండి

Ranya Rao: చెంపదెబ్బలు కొట్టారు, తిండిపెట్టలేదు.. డీఆర్ఐ ఏడీజీకి రన్యారావు లేఖ

DMK Leaders: హిందీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు.. డీఎంకే నేతల రియాక్షన్

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 15 , 2025 | 07:57 PM