Jyoti Malhotra: జ్యోతిని పావుగా వాడుకున్న పాక్! కొత్త తరహా యుద్ధంతో..
ABN, Publish Date - May 19 , 2025 | 06:04 PM
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పాకిస్థాన్ పావుగా వాడుకుందని తెలుస్తోంది. కొత్త తరహా యుద్ధం కోసం ఆమెను ఆయుధంగా ఉపయోగించుకుందట శత్రుదేశం. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడి దరిమిలా ఉగ్రవాదులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా గాలింపులు చేపడుతోంది. ఇందులో భాగంగా టెర్రరిస్టులకు సహకరిస్తున్న వారిని గుర్తించడం మీద నిఘా వర్గాలు ఫోకస్ చేశాయి. గూఢచర్యం చేస్తూ మన ఆర్మీ రహస్యాలను శత్రుదేశానికి చేరవేస్తున్న దేశద్రోహుల కోసం వేటాడుతున్నాయి. ఇప్పటికే గూఢచర్యం చేస్తున్న పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వారిలో జ్యోతి మల్హోత్రా ఉదంతం సంచలనంగా మారింది. ఆమె కేసులో ఒక్కొక్కటిగా నమ్మలేని విషయాలు బయటకు వస్తున్నాయి. పహల్గాం దాడికి కొన్ని నెలల ముందు ఆ ప్రాంతానికి ఆమె వెళ్లడం, పాక్ ఐఎస్‌ఐతో సంబంధాలున్న ఆ దేశ రాయబార కార్యాలయ ఉద్యోగి డానిష్‌తో జ్యోతికి సన్నిహిత సంబంధం ఉందనే విషయాలు సంచలనంగా మారాయి. ఈ తరుణంలోనే జ్యోతిని పాక్ పావుగా వాడుకుందనే మరో విషయం బయటకు వచ్చింది.
ఆయుధంలా వాడాలని..
కొత్త తరహా యుద్ధం కోసం జ్యోతి మల్హోత్రాను పాకిస్థాన్ ఆయుధంగా వాడుకుందని తెలిస్తోంది. భారత్‌తో సమాచార యుద్ధం (ఇన్‌ఫర్‌మేషన్ వార్‌ఫేర్)లో జ్యోతిని కీలక ఆయుధంగా మలచుకోవాలని, సమయాన్ని బట్టి వాడుకోవాలని పాక్ అనుకుందట. ఇందులో భాగంగానే ఆమెతో పాకిస్థాన్‌కు అనుకూలంగా ప్రచారం చేయించారని సమాచారం. ఇన్‌ఫర్‌మేషన్ వార్‌ఫేర్‌లో భాగంగా ఒకవైపు పాక్ అనుకూలిత ప్రచారం చేయించడంతోపాటు మరోవైపు భారత్‌పై విద్వేషం పెరిగేలా చేయడంలోనూ జ్యోతిని వాడుకోవాలని డిసైడ్ అయ్యారని వినిపిస్తోంది.
కూపీ లాగుతున్నారు!
పాకిస్థాన్ అనుకూల ప్రచారాలను పక్కనబెడితే.. భారత మిలటరీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని శత్రుదేశానికి పంపారా? అనే కోణంలో జ్యోతిని విచారిస్తున్నారట పోలీసులు. జ్యోతితోపాటు పాక్‌ను సందర్శించిన ఆమె స్నేహితులు, ఇతర ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్లనూ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారట. కాగా, 2023, 2024తోపాటు 2025లోనూ పాక్‌కు జ్యోతి వెళ్లినట్లు బయటపడింది. పహల్గాం ఉగ్రదాడికి ముందు మార్చి నెలలో శత్రుదేశాన్ని ఆమె సందర్శించిందని తెలిసింది.
ఇవీ చదవండి:
ఆర్సీబీలోకి ఎక్స్‌ప్రెస్ బౌలర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 19 , 2025 | 06:50 PM