Police Encounter: ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ సభ్యుడికి గాయాలు
ABN, Publish Date - May 21 , 2025 | 11:52 AM
Police Encounter: ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ సభ్యుడు గాయపడ్డారు. అతడి వద్ద నుంచి హెరాయిన్‌తోపాటు పిస్తోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయని పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు.
భోపాల్, మే 21: మధ్యప్రదేశ్‌లోని జలంధర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ దిల్‌ప్రీత్ బాబ్ గ్యాంగ్‌కు చెందిన సభ్యుడు మన్‌ప్రీత్ సింగ్ గాయపడ్డారని పోలీస్ ఉన్నతాధికారి హరివిందర్ సింగ్ వెల్లడించారు. అతడి వద్ద నుంచి అక్రమంగా కలిగి ఉన్న .32 పిస్తోళ్లు, క్యాటరిడ్జ్‌లతోపాటు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇక అతడు ప్రయాణించిన వాహనం సైతం చోరీ చేసిందేనని తెలిపారు. ఆ వాహనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు. అతడిపై 109 సెక్షన్ కింద హత్యాయత్నం, ఎన్‌డీపీఎస్, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం తదితర కేసులు నమోదు చేశామన్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. అదంపూర్ సమీపంలోని కలరా గ్రామం వద్ద డీఎస్పీ ఇంద్రజిత్ సింగ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆ క్రమంలో మన్ ప్రీత్ సింగ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపాలని పోలీస్ సిబ్బంది సూచించారు. కానీ అతడు ఆపినట్లే ఆపి.. కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి.. ముందున్న సిగ్నల్ బోర్డును ఢీకొట్టాడు. అనంతరం అతడు పోలీసులపై కాల్పలుకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు సైతం ఎదురు కాల్పులు జరపడంతో.. మన్ ప్రీత్ సింగ్ కాలికి గాయమైందని పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు.
ఇప్పటికే అతడిపై దొంగతనం, డ్రగ్స్ అక్రమ రవాణాతోపాటు ఆయుధాలు కలిగి ఉండడం తదితర అంశాల కింద మొత్తం 19 కేసులు నమోదయ్యాయని వివరించారు. బుల్లెట్ గాయం కారణంగా.. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఎస్పీ హరివిందర్ సింగ్ తెలిపారు. హోషియార్‌పూర్ జిల్లాలోని బిన్‌జాన్ గ్రామం అతడి స్వస్థలమని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Etela Rajender: కాళేశ్వరం విచారణకు హాజరువుతా
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం
Road Accident: డీసీఎంను ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్పాట్ డెడ్..
For National News And Telugu News
Updated Date - May 21 , 2025 | 03:22 PM