ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indigo: విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు.. అత్యవసరంగా ల్యాండింగ్

ABN, Publish Date - Jun 17 , 2025 | 01:05 PM

అహ్మదాబాద్ విమాన ఘటనతో ప్రయాణికులు తీవ్ర కలత చెందుతున్నారు. అలాంటి వేళ.. పలు విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి.

ముంబై, జూన్ 17: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అనంతరం దేశంలో పలు ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాల సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికుడికి ఓ విధమైన భయాందోళన కలిగించే పరిస్థితి నెలకొంది. అలాంటి వేళ.. పలు విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. మంగళవారం కొచ్చి నుంచి న్యూఢిల్లీకి ఇండిగో విమానం ప్రయాణికులతో బయలుదేరింది.

ఆ కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉందని.. మరికొన్ని నిమిషాల్లో అది పేలనుదంటూ ఆగంతకులు కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో విమానాన్ని మళ్లించి.. నాగ్‌పూర్‌‌‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ంగ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

అనంతరం విమానంలోని ప్రయాణికులకు కిందకి దింపేశారు. ఆ తర్వాత విమానాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తరలించి.. తనిఖీలు చేపట్టారు. ఈ విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపులు రావాడంతో వెంటనే మళ్లించామని ఎయిర్‌పోర్ట్ అధికారులు చెప్పారు. అలాగే ఈ ఘటనపై కేంద్ర పారిశ్రామిక భద్రత దళాలు, స్థానిక పోలీసులు విచారణ చేపట్టామని ఎయిర్ పోర్ట్ అధికారులు వివరించారు.

ఇవి కూడా చదవండి:

ఇంటికి చేరిన మృతదేహం.. పైలట్ సుమీత్ సబర్వాల్‌‌కు ఘన నివాళులు

భారీ వర్షాలు.. 18 మంది మృతి

For National News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 01:18 PM