India-pakistan tensions: పాత బంకర్లను పునురుద్ధరిస్తున్న ఇండియన్ ఆర్మీ
ABN, Publish Date - May 06 , 2025 | 02:51 PM
ఢిల్లీ ముంబై సహా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్‌కు భారత్ సిద్ధమవుతుండగా, ఇదే సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి దశాబ్దాల నాటి పాత బంకర్లను పునరుద్ధరించే పనులను ఇండియన్ ఆర్మీ చేపట్టింది.
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పాక్ ఉగ్రవాదులను వెంటాడి వేటాడుతామంటూ భారత్ భీషణ ప్రతిజ్ఞ చేయడంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఢిల్లీ ముంబై సహా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్‌కు భారత్ సిద్ధమవుతుండగా, ఇదే సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి దశాబ్దాల నాటి పాత బంకర్లను పునరుద్ధరించే పనులను ఇండియన్ ఆర్మీ చేపట్టింది. కంచుకోట లాంటి ఈ బంకర్లను 1965, 1971 యుద్ధ సమయాల్లో ఆర్మీ వినియోగంలోకి తెచ్చింది. ఇప్పుడు మరోసారి వాటిని పునరుద్ధరిస్తూ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.
India Pak War: దేశంలో యుద్ద వాతావరణం.. క్యాటగిరీ 2లో విశాఖ, హైదరాబాద్
బంకర్లలో షెల్టర్
జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల వద్ద బలగాలు మరింత అప్రమత్తత పాటిస్తున్నాయి. అత్యవసర పరిస్థితి అంటూ వస్తే సరిహద్దులకు సమీపంలోనే జనవాసాలను ఖాళీ చేయించి వారిని కొత్తగా నిర్మించిన అండర్‌గ్రౌండ్ బంకర్లకు తరలించనున్నారు. సున్నిత ప్రాంతాలైన ఉరి నుంచి నౌషెరా సెక్టార్ వరకూ ప్రజలను ఆ బంకర్లకు తరలిస్తారు. ఎల్ఐసీ, అంతర్జాతీయ సరహద్దులకు సమీపంలోని ఈ బంకర్లలో నీటి సరఫరా, కనీస అవసరాలను అందుబాటులో ఉంచనున్నారు. యుద్ధం అంటూ మొదలైతే ఆ ప్రభావం మొదటగా ఎల్ఓసీ వెంబడి ప్రజలపై పడే అవకాశం ఉండటంతో ముందస్తు భద్రతా చర్యలను ఆర్మీ చేపడుతోంది.
ఎయిర్ రైడ్ సైరన్ టెస్ట్
కాగా, శ్రీనగర్‌లో దాల్‌లేక్ సమీపంలో ఎయిర్ రైడ్ సైరెన్ మాక్ డ్రిల్స్‌ను మంగళవారంనాడు నిర్వహించారు. హైఅలర్ట్ పరిస్థితుల్లో స్థానిక అధికారులు, భద్రతా అధికారులను అప్రమత్తం చేయడానికి లౌడ్ సైరన్ డ్రిల్స్ జరిపారు. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్, రాజౌరి జిల్లాలో భద్రతను మరింత ఎక్కువ చేశారు. కీలకమైన మార్గాల్లో వాహనాల తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశారు.
ఇవి కూడా చదవండి
Security rill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Pakistan Army: బుద్ధి మార్చుకోని పాకిస్తాన్.. 12వ రోజు కూడా కవ్వింపు చర్యలు
Anurag Thakur: సరిహద్దుల్లో పేట్రేగితే పాక్‌ను నామరూపాల్లేకుండా చేస్తాం
For National News And Telugu News
Updated Date - May 06 , 2025 | 05:13 PM