ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

OpenAI CEO Sam Altman: ఏఐ వినియోగంలో అమెరికాను మించిపోనున్న భారత్

ABN, Publish Date - Aug 08 , 2025 | 09:47 PM

ఇండియా.. ఏఐ వినియోగంలో రారాజు కాబోతోందని ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్ చెప్పారు. భారత్‌లో ఏఐ వినియోగం అతి వేగంగా పెరుగుతోందని.. ఈ స్పీడు చూస్తుంటే త్వరలో అమెరికాను కూడా..

OpenAI CEO Sam Altman

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతదేశం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగంలో రారాజు కాబోతోందని ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్ చెప్పారు. ఓపెన్‌ఏఐకి అమెరికా తర్వాత భారతదేశం అతిపెద్ద మార్కెట్ అన్నారు. భారత్‌లో ఏఐ వినియోగం అతి వేగంగా పెరుగుతోందని.. ఈ స్పీడు చూస్తుంటే త్వరలో అమెరికాను కూడా భారత్ అధిగమించగలదని శామ్ చెప్పారు.

ఓపెన్ ఏఐ తాజాగా తన అత్యాధునిక మోడల్ జీపీటీ-5 వెర్షన్ ను అధికారికంగా విడుదల చేసింది. ఇది అత్యంత అడ్వాన్స్‌డ్‌ ఏఐ మోడల్. కోడింగ్‌, మ్యాథ్స్‌, రైటింగ్‌, హెల్త్‌కేర్‌ వంటి అనేక రంగాల్లో పీహెచ్‌డీ స్థాయిలో సమాధానాలను ఇవ్వగలదు. ఇది ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత శక్తిమంతమైన మోడల్‌గా కంపెనీ చెబుతోంది. ఈ సందర్భంలో సంస్థ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్ భారత్‌లో ఏఐ వినియోగం గురించి చాలా గొప్పగా వ్యాఖ్యానించారు. భారత్‌లో సాధారణ ప్రజల నుంచి వ్యాపార సంస్థల వరకు ఏఐ వినియోగం చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు.

ఏఐతో భారతీయులు చేస్తున్న వినూత్న ప్రయోగాలు చాలా గొప్పవని శామ్ కీర్తించారు. ఓపెన్‌ఏఐ ఉత్పత్తులను భారత్‌లో మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు.. స్థానిక భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, శామ్ ఆల్ట్‌మన్ సెప్టెంబర్‌లో భారత‌ పర్యటనకు రానుండటంతో అతని పర్యటనపై భారత్ లో ఏఐకి మరింత ఊపుతీసుకొచ్చే అవకాశం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్

బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 08 , 2025 | 09:48 PM