Pehalgam Terror Attack: పాక్‌కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం
ABN, Publish Date - May 01 , 2025 | 09:13 AM
Pehalgam Terror Attack: కయ్యానికి కాలుదువ్వుతోన్న దాయాది దేశం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్‌కు వ్యతిరేకంగా పాక్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ, మే 01: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌లు ఒక దేశానికి వ్యతిరేకంగా మరోక దేశం పలు నిర్ణయాలు తీసుకోన్నాయి. ఆ క్రమంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు అమలులో ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన విమానాలన్నింటికి ఈ నిషేధం వర్తిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ దేశ విమానాలు.. కౌలాలంపూర్ తదితర దేశాలకు వెళ్లాలంటే.. చైనా, శ్రీలంక మీదగా వెళ్ల వలసి వస్తుంది. దాంతో ఆయా విమానాలు గమ్యస్థానానికి చేరుకోవడానికి అధిక సమయం పడుతోంది. మరోవైపు ఇప్పటికే పాకిస్థాన్.. తమ గగనతలంలోకి భారత్‌కు చెందిన విమానాలు ప్రవేశించకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. దేశంలోని నివసిస్తున్న పాక్ వాసుల సైతం తిరిగి స్వదేశానికి వెళ్లి పోవాలని తెలిపింది. ఈ తరహా నిర్ణయాల కారణంగా.. పాక్ సైతం అదే రీతిలో స్పందించింది. భారత్‌తో గతంలో చేసుకొన్న సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. తమ గగనతలంలో భారత్ విమానాలు ప్రవేశించకుండా నిషేధం సైతం విధించింది. మరోవైపు ఏ క్షణంలోనైనా భారత్ తమపై యుద్ధానికి దిగుతోందంటూ పాక్ భయాందోళనలు వ్యక్తపరుస్తోంది.
అదీకాక గత వారం రోజులుగా వాస్తవాదీన రేఖ వెంబడి భారత్ భూభాగంపైకి పాక్ కాల్పులకు తెగబడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో పాక్ దళాలకు భారత్ అదే రీతిలో సమాధానమిస్తుంది. అయితే పాక్ కాల్పుల్లో ఇప్పటి వరకు ఎవరు గాయపడడం కానీ.. మరణించడం కానీ జరగలేదని సైనికాధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pakistan: పహల్గాం దాడి నేపథ్యంలో పాక్ కీలక నిర్ణయం
AI coding: మా కంపెనీ కోడ్‌లో 30 శాతం ఏఐతోనే
Pahalgam Terror Attack: ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.. భారత్, పాక్‌లకు అమెరికా పిలుపు
For National News And Telugu News
Updated Date - May 01 , 2025 | 10:36 AM