ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Post : రిజిస్టర్డ్ పోస్ట్ మాయం.. పోస్టల్ శాఖ కీలక నిర్ణయం

ABN, Publish Date - Aug 16 , 2025 | 05:24 PM

ఇప్పటికే టెలిగ్రామ్ సేవలకు మంగళం పాడారు. తాజాగా పోస్టల్ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇది ప్రజలకు పిడుగు లాంటి వార్త అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

India post

దేశ ప్రజలకు రైల్వే, పోస్టల్, బ్యాంకింగ్, ఇంగ్లీష్, టెలిగ్రామ్ తదితర సౌకర్యాలన్నీ బ్రిటిష్ వాళ్లు అందించినవే. అయితే ఆ జాబితాలోని టెలిగ్రామ్‌ సేవలను ఇప్పటికే నిలిపివేశారు. తాజాగా పోస్టల్‌‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తమ శాఖలో రిజిస్టర్డ్ పోస్ట్ సేవా సౌకర్యాన్ని శాశ్వతంగా నిలిపి వేయనున్నట్లు ప్రకటించింది. 2025, సెప్టెంబర్ 01వ తేదీ నుంచి ఈ రిజిస్టర్డ్ పోస్ట్ సేవలకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు చెప్పింది. అయితే ఈ రిజిస్టర్డ్ పోస్ట్‌ సేవలను ఇకపై స్పీడ్‌ పోస్ట్‌లో విలీనం చేస్తున్నట్లు వివరించింది.

సామాన్యుడి సౌకర్యం..

మాములుగా అయితే.. రిజిస్టర్డ్ పోస్ట్ వల్ల సామాన్యుడికి అనేక సౌకర్యాలు ఉండేవి. ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. ఎవరికైనా నోటీసులు పంపాలంటే.. రిజిస్టర్డ్ పోస్ట్ చేసి.. దానికి అకనాలెడ్జ్‌మెంట్‌ను జత చేసే వారు. దీని ద్వారా ఎదుటి వారిని నోటీసులు అందిన అనంతరం.. ఆ అకనాలెడ్జ్‌మెంట్ మళ్లీ పంపిన వారి చేతికి తిరిగి వచ్చేది. దీంతో మనం ఎవరికైతే నోటీసులు పంపామో.. వారికి అవి అందినట్లు మన వద్ద ఒక స్పష్టమైన ఆధారం ఉండేది. అంతేకాదు ఈ రిజిస్టర్డ్ పోస్ట్‌కు ఒక నెంబర్ సైతం కేటాయించే వారు.

అర్థశతాబ్దంగా..

ఆ నెంబర్ ట్రాక్ చేస్తే.. పంపిన పోస్ట్ ఎక్కడ ఉంది. పోస్ట్ చేసిన వారికి అది ఎప్పుడు అందుతుంది.. ఒక వేళ అందితే అది ఎప్పుడు అందుతుందనే విషయం ఆ ట్రాక్ ద్వారా ఆన్ లైన్‌లో గమనించే వారు. జాబ్ ఆఫర్ కానీ, ప్రభుత్వంతో ఉత్తరప్రత్యుత్తరాలు కానీ.. ఈ రిజిస్టర్డ్ పోస్ట్ సేవల ద్వారానే కోట్లాది మంది భారతీయులు గత అర్థశతాబ్దంగా పొందారు. కానీ రిజిస్టర్ పోస్ట్ సేవా సౌకర్యాన్ని పూర్తిగా నిలిపి వేయనుండడంతో.. ప్రజలు ఆ సౌకర్యాన్ని కోల్పోయామనే భావన వారిలో స్పష్టంగా కనిపించనుందని ఒక చర్చ అయితే నడుస్తోంది.

అందుకే.. ఈ నిర్ణయం

పోస్టల్ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తుంది. 2011 12 ఆర్థిక సంవత్సరంలో 244.4 మిలియన్ రిజిస్టర్డ్ ఐటమ్స్ పోస్ట్ అయ్యాయి. కానీ 2019-20 వచ్చే సరికి ఆ సంఖ్య 184.6 మిలియన్ ఐటమ్స్‌కు తగ్గిపోయాయి. అంటే 25 శాతం మేర రిజిస్టర్డ్ పోస్టులు తగ్గిపోయాయి. అదీకాక.. ఈ కామర్స్ లాజిస్టిక్స్, ప్రైవేట్ కోరియర్లు ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడికక్కడ పెరగడంతో.. ప్రజలు అటువైపు మళ్లారు. ఈ నేపథ్యంలో పోస్టల్ రిజిస్టర్డ్ పోస్ట్ సౌకర్యానికి కత్తెర వేసింది.

ఈ సేవలు ఫుల్ స్టాప్‌..

ఈ రిజిస్టర్డ్ పోస్ట్‌ను ఇకపై స్పీడ్ పోస్ట్ సేవల్లో విలీనం చేస్తున్నామని పోస్టల్ శాఖ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఇప్పటికే అన్ని శాఖలు, కోర్టులు, విద్య సంస్థలకు సమాచారం అందించామని ప్రకటించారు. కొత్త వ్యవస్థ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని గమనించాలని ఆయా శాఖలకు సూచించారు.

ఇక ఛార్జీల మోతే..

అయితే ఏదైనా కవర్ రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తే.. వాటి ధరలు చాలా స్వల్పంగా ఉండేవని.. కానీ స్పీడ్ పోస్ట్‌లో అలా కాదనే అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతుంది. అంటే.. స్పీడ్ పోస్ట్‌లో 50 గ్రాములకు రూ. 41 ఛార్జ్ చేస్తారని అంటున్నారు. దీంతో బరువును బట్టి.. స్పీడ్ పోస్ట్ పెరుగుతోందని ఆందోళన పలువురిలో వ్యక్తమవుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

రూ.11,000 కోట్లతో హైవే ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

ఓట్ చోరీ ప్రచారం.. స్పూఫ్ వీడియో షేర్ చేసిన రాహుల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2025 | 05:34 PM