ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sindhur Operation: పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు

ABN, Publish Date - May 07 , 2025 | 06:31 AM

పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో మెరుపు దాడులు చేపట్టింది. మొత్తం 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.

  • ఆపరేషన్‌ సింధూర్‌ స్టార్ట్‌

  • పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో మిసైల్‌ దాడితో తరలిపోతున్న ప్రజలు

  • పాక్‌పై ప్రతీకార దాడులు ప్రారంభించిన భారత్‌..

  • మొత్తం 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం

న్యూఢిల్లీ, మే 6 : పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత సైన్యం మెరుపు దాడులు ప్రారంభించింది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి చేసి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తోపాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను, వారి సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసినట్లు తెలిసింది. అత్యంత కచ్చితత్వంతో ఈ దాడులు జరపడం విశేషం. ఈ దాడులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. కాగా భారత సైన్యం దాడులను పాకిస్థాన్‌ సైన్యం నిర్ధారించింది. భారత్‌ దాడి చేసిందని ప్రకటించింది. కోట్లి, ముజఫరాబాద్‌, బహవల్‌పూర్‌లపై మిసైల్స్‌తో దాడులు చేసినట్లు పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, మరో 12 మంది గాయపడ్డట్టు చెప్పారు.

Updated Date - May 07 , 2025 | 06:45 AM