Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్
ABN, Publish Date - May 11 , 2025 | 03:30 PM
ఆపరేషన్ సింధూర్ కేవలం మిలట్రీ చర్య మాత్రమే కాదని, భారతదేశ రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్ప శక్తికి చిహ్నమని రాజ్‌నాథ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ సత్తా ఏమిటో చూపించామని, ఉగ్రవాదులు, వారి మాస్టర్లు సరహద్దులు వెంబడి ఉన్నా వెంటాడి వేటాడతామని నిరూపించామని చెప్పారు.
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. భారత సాయుధ బలగాల సత్తా సరిహద్దులకే పరిమితం కాలేదని, పాక్ సైని ప్రధాన కేంద్రమున్న రావల్పిండిలోని గర్జించిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్‌ను వర్చువల్ తరహాలో రాజ్‌నాథ్ సింగ్ ఆదివారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండియన్ ఆర్మీ ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించడంతో పాటు నిగ్రహం పాటించిందని, పాకిస్థాన్‌లో పలు మిలటరీ పొజిషన్లపై భీకరదాడి చేసి గట్టి సమాధానం ఇచ్చిందని చెప్పారు.
BrahMos Facility: బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్ షురూ.. ఏటా 100 క్షిపణులు తయారీ
ఆపరేషన్ సింధూర్ కేవలం మిలట్రీ చర్య మాత్రమే కాదని, భారతదేశ రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్ప శక్తికి చిహ్నమని రాజ్‌నాథ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ సత్తా ఏమిటో చూపించామని, ఉగ్రవాదులు, వారి మాస్టర్లు సరహద్దులు వెంబడి ఉన్నా వెంటాడి వేటాడతామని నిరూపించామని చెప్పారు. పహల్గాం బాధితులకు న్యాయం చేకూరిందని చెప్పారు. భారత్ ఎక్కడా ప్రజలను టార్గెట్ చేయలేదని, పాక్ మాత్రం భారత ప్రజలు, గురుద్వారాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని విమర్శించారు. పాక్ దాడులను మన సైన్యం దీటుగా తిప్పికొట్టిందని చెప్పారు.
నయాభారత్
''ఇది నయాభారత్...ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించబోమని ఆపరేషన్ సిందూర్‌తో చాటిచెప్పాం'' అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రత్యేక కారణాల వల్ల ఈరోజు తాను లక్నో రాలేకపోయానని, పోఖ్రాన్ అణు పరీక్షలు చేసిన రోజునే లక్నో యూనిట్ ప్రారంభం కావడం గొప్పగా ఉందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
కశ్మీర్ సమస్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 11 , 2025 | 03:37 PM