BrahMos Facility: బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్ షురూ.. ఏటా 100 క్షిపణులు తయారీ
ABN , Publish Date - May 11 , 2025 | 02:48 PM
ప్రధానమత్రి నరేంద్ర మోదీ 2018లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో ప్రారంభించిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా లక్నో యూనిట్‌ను ప్రకటించారు. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యూనిట్‌లో ఏటా 80 నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తారు.

న్యూఢిల్లీ: 'ఆపరేషన్ సింధూర్'తో శత్రువులను గడగడలాడించిన బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తి యూనిట్‌ను ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఆదివారంనాడు ప్రారంభించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభించగా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఎయిర్‌ఫోర్స్ సంచలన ప్రకటన
ఏటా 100 క్షిపణుల తయారీ
ప్రధానమత్రి నరేంద్ర మోదీ 2018లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో ప్రారంభించిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా ఈ యూనిట్‌ను ప్రకటించారు. రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యూనిట్‌లో ఏటా 80 నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తారు. అదనంగా ఏటా 100 నుంచి 150 నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ క్షిపణులను కూడా తయారు చేయనున్నారు. 2021లో ఈ యూనిట్‌కు శంకుస్థాపన జరిగింది.
డిఫెన్స్ కారిడార్ ప్రాజెక్టు తొలి ఫేజ్ కింద 1,600 హెక్టార్ల భూమని ఇప్పటికే కేటాయించామని, పలు కీలక కంపెనీలు ఎంఓయూలు చేశాయని అధికారులు తెలిపారు. మరో యూనిట్ ఏర్పాటుకు బీహెచ్ఈఎల్‌తో చర్చలు జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ ఇండస్ట్రియల్ డవలప్‌మెంట్ అథారిటీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. మొత్తం కేటాయింపులో బ్రహ్మోస్ ఫెసిలిటీకి 80 ఎకరాలు కేటాయించామని, లక్నో నోడ్‌లో 12 కంపెనీలకు 117 ఎకరాలు కేటాయించామన్నారు. ఇక్కడ ఏరోస్పేస్ రక్షణ తయారీలో ఉపయోగించే పదార్ధాలను ఉత్పత్తి చేస్తారని, వీటిని మిషన్ చంద్రయాన్ వంటి అంతరిక్ష కార్యక్రమాలు, ఫెటర్ జెట్‌లలో ఉపయోగిస్తారని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
కశ్మీర్ సమస్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి