ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Alert: ఐఎండీ అలర్ట్.. జూన్ 14 వరకూ ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

ABN, Publish Date - Jun 08 , 2025 | 05:09 PM

భారత వాతావరణ శాఖ (IMD) వర్షాల గురించి కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో జూన్ 8 నుంచి 14 వరకూ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

heavy rainfall June 2025

ఢిల్లీ: దేశవ్యాప్తంగా మళ్లీ వాతావరణం మారబోతుంది. భారత వాతావరణ విభాగం (IMD) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, వచ్చే వారం మొత్తం వర్షాలు (Rain Alert) కురవనున్నాయి. ఈ వానలు ఎక్కడెక్కడ పడనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈశాన్య భారతదేశంలో ప్రస్తుతం రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ క్రమంలో జూన్ 11 నుంచి 14 వరకూ అరుణాచల్ ప్రదేశ్‌, అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దీంతోపాటు నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాం ప్రాంతాల్లో జూన్ 10 నుంచి 13 వరకూ వర్షాలు కురిసే ఛాన్సుంది. కానీ త్రిపురలో ప్రత్యేకంగా జూన్ 8 నుంచి 12 మధ్య తీవ్రగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

దక్షిణ భారతదేశానికి కూడా..

మరోవైపు కేరళ, మహే తీర ప్రాంతాలైన కర్ణాటక, లక్షద్వీప్ లలో ఈ వారం మొత్తం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. జూన్ 10 నుంచి 14 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, తూర్పు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 13, 14న కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ హెచ్చరించింది. జూన్ 12న కర్ణాటకలో 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.

మధ్య భారత్, తూర్పు ప్రాంతాల్లో

బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గంగా తీర ప్రాంత బెంగాల్ లలో ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వాతావరణం ఉండొచ్చు. బిహార్, విదర్భలో జూన్ 11, 12 తేదీలలో గంటకు 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా. జూన్ 9న అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికా ఉంది.

ఉత్తర భారత్‎లో వేడి

ఇక రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో జూన్ 8 నుంచి 11 వరకూ వేడి గాలులు వీస్తాయని అంచనా. పశ్చిమ రాజస్థాన్‌లో జూన్ 9న వేడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరిక. పంజాబ్, హర్యానా, ఢిల్లీలకు జూన్ 9, 10 తేదీలలో హాట్ నైట్స్ అంటే రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవచ్చని IMD వెల్లడించింది. కానీ జూన్ 11 నుంచి 14 వరకూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా.

పశ్చిమ భారత్‌ పరిస్థితి

కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతాల్లో జూన్ 8 నుంచి 14 వరకూ వర్షాలు కొనసాగుతాయి. జూన్ 12 నుంచి 14 వరకూ కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మధ్య, వాయవ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు వచ్చే 3 రోజుల్లో 2-3 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల వేడిగాలుల తీవ్రత మరింత పెరగనుంది.

ఇవీ చదవండి:

ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..


4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 09 , 2025 | 11:55 AM