PM Modi: రైతు వ్యతిరేక చర్యలకు అడ్డుగోడగా నిలబడతా.. ట్రంప్‌కు పరోక్ష సందేశం
ABN, Publish Date - Aug 15 , 2025 | 05:18 PM
రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎలాంటి మూల్యం మూల్యం చెల్లించుకునేందుకైనా తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మోదీ గతవారంలోనూ విస్పష్టంగా చెప్పారు. అమెరికా వ్యవసాయ, పాల ఉత్పత్తులకు భారత్ మార్కెట్‌లోకి చొప్పించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తుండగా, ఇందుకు భారత్ సముఖంగా లేదు.
న్యూఢిల్లీ: రైతన్నలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఎర్రకోట వేదిక నుంచి భరోసా ఇచ్చారు. దేశం స్వయంసమృద్ధికి పాటుపడుతున్న రైతులకు అండగా నిలుస్తామని, వారి ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికాతో 'ట్రేడ్ డీల్' విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతుండటం, ట్రంప్ టారిఫ్ బెదిరింపుల నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
'దేశంలోని రైతులు, మత్స్యకారుల ప్రాధాన్యతకు కట్టుబడి ఉన్నాం. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదు. వారి ప్రయోజనాలు దెబ్బతినకుండా మోదీ ఒక రక్షణ గోడగా నిలుస్తారు' అని ప్రధాని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, ఇతర దేశాలపై ఆధారపడితే అది విపత్తుకు దారితీసే అవకాశం ఉంటుందన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలంటే మనం తప్పనిసరిగా స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంటుందని చెప్పారు. రైతులకు అడిషనల్ సపోర్ట్ అవసరమైన 100 జిల్లాలను ప్రభుత్వం గుర్తించిందని, వాటిని పటిష్టం చేసేందుకు ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య క్రిషి యోజనను తాము ప్రారంభించినట్టు చెప్పారు.
రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎలాంటి మూల్యం చెల్లించుకునేందుకైనా తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని గతవారంలోనూ విస్పష్టంగా చెప్పారు. అమెరికా వ్యవసాయ, పాల ఉత్పత్తులకు భారత్ మార్కెట్‌లోకి చొప్పించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తుండగా, ఇందుకు భారత్ సముఖంగా లేదు. దీంతో అమెరికాతో ట్రేడ్ డీల్ కోసం ఐదు రౌండ్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ విషయంలో ఓవైపు ప్రతిష్ఠంభన కొనసాగుతుండగా ఇండియాపై 25 శాతం టారిఫ్, అదనంగా 25 శాతం లెవీని ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తే మరిన్ని సుంకాలు తప్పవని కూడా ట్రంప్ హెచ్చరికలు చేస్తున్నారు.
2025 నాటికి మేడ్-ఇన్-ఇండియా చిప్స్
అంతర్జాతీయంగా వాణిజ్య అస్థిరతల మధ్య 'స్వదేశీ' ఉత్పత్తులకు ప్రధాని ప్రాధాన్యత ఇస్తున్నారు. 21వ శతాబ్దాన్ని టెక్నాలజీ డ్రైవెన్ సెంచరీగా మలుచుకోవాలని మోదీ ఎర్రకోట నుంచి పిలుపునిచ్చారు. ఈ ఏడాది చివరినాటికి 'మేడ్ ఇన్ ఇండియా చిప్స్' మార్కెట్లోకి రానున్నాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన్ చక్ర.. ఎర్రకోట వేదికగా మోదీ
ఎర్రకోటకు వెళ్లని రాహుల్, ఖర్గే.. కారణం ఇదేనా?..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 15 , 2025 | 07:19 PM