Heavy Rains: నీలగిరిలో కుండపోత.. పడిపోయిన విద్యుత్ స్తంభాల
ABN, Publish Date - Jul 18 , 2025 | 12:21 PM
తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లాలో బుధవారం సాయంత్రం నుండి గురువారం రాత్రి వరకు కుండపోతగా వర్షం కురిసింది. పెనుగాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలపై కూలిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఊటీ, కున్నూరు, గూడలూరు, కొత్తగిరి, పందలూరు తదితర ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.
చెన్నై: నీలగిరి జిల్లాలో బుధవారం సాయంత్రం నుండి గురువారం రాత్రి వరకు కుండపోతగా వర్షం కురిసింది. పెనుగాలులలకు చెట్లు విద్యుత్ స్తంభాలపై కూలిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఊటీ, కున్నూరు, గూడలూరు(Ooty, Coonoor, Gudalur), కొత్తగిరి, పందలూరు తదితర ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. వెలింగ్టన్, ఒట్టుపట్టరై, అరువంగాడు, కొలకొంబై, కాట్టేరి తదితర ప్రాంతాల్లో గంటకు పైగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి.
పందలూరు పరిసర ప్రాంతాలైన ఉప్పడి, పొన్ని, నెలాకోటై, పితర్‌కాడు, పాట్టవయల్, అంబలముల తదితర ప్రాంతాల్లో పెనుగాలులతో వర్షాలు కురిశాయి. దీని కారణంగా అయ్యన్‌కొల్లి నుండి కారకొల్లి వరకు రహదారిలో విత్యుత్ తీగెలు తెగి చెట్లపడ్డాయి. దీంతో ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. పలుచోట్ల రహదారుల్లో చెట్లు కూలిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌బోర్డు, అధికారులు, అగ్నిమాపక దళం సభ్యులు హుటాహుటిన అక్కడి చేరుకుని చెట్లను తొలగించే పనులు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..
బీఆర్‌ఎస్ నా దారిలోకి రావాల్సిందే..
Read Latest Telangana News and National News
Updated Date - Jul 18 , 2025 | 01:28 PM