Himachal Pradesh: హిమాచల్‌లో భారీ వర్షాలు.. ఇప్పటివరకు 261 మంది మృతి
ABN, Publish Date - Aug 17 , 2025 | 11:17 AM
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు అనేక జిల్లాలను అతలాకుతలం చేశాయి. వానల కారణంగా జూన్ 20 నుంచి ఆగస్టు 16 వరకు రాష్ట్రంలో ఏకంగా 261 మంది మరణించారని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్ మళ్లీ వానలతో అతలాకుతలం (Himachal Pradesh Rains) అవుతోంది. గత రెండు నెలల్లో రాష్ట్రం అంతటా భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల మండి జిల్లాలోని పానర్సా, టకోలి, నాగ్వైన్ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. చండీగఢ్-మనాలి జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను పూర్తిగా ఆపేసింది. కొన్ని చోట్ల రోడ్లు పూర్తిగా కూలిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
261 మంది మృతులు
ఈ వరదల్లో మానవ ప్రాణ నష్టం జరగలేదని మండి జిల్లా ఎఎస్‌పీ సచిన్ హిరేమత్ తెలిపారు. కానీ పోలీసులు అప్రమత్తమై పహారా కాస్తూ, రోడ్లు క్లిన్ చేయించి రవాణా తిరిగి ప్రారంభించే పనిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం జూన్ 20 నుంచి ఆగస్ట్ 16 వరకు వర్షాలతో మృతి చెందిన వారి సంఖ్య 261కి చేరింది. వీరిలో 136 మంది వర్షాలకు సంబంధించి జరిగిన ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.
వర్షాల కారణంగా నష్టం
జిల్లాల వారీగా మండి జిల్లాలో అత్యధికంగా 26 మంది మృతి చెందగా, కాంగ్రాలో 28 మంది, కుల్లులో 11 మంది, చంబాలో 10 మంది, మరణించారు. మరోవైపు 125 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఈ వర్షాల కారణంగా రాష్ట్రానికి మొత్తం రూ. 2,14,457 లక్షల నష్టం వాటిల్లింది. PWD (పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్) ప్రకారం రూ. 1.18 లక్షల కోట్లు, వ్యవసాయం, తోటల శాఖలకు రూ. 83,000 కోట్లకు పైగా నష్టం జరిగింది.
27,000కు పైగా పశువులు
ఈ క్రమంలో 278 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, 703 పశువుల గుడిసెలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంకా 27,000కు పైగా పశువులు, పక్షులు వర్షాల వల్ల మృతి చెందాయి. ప్రధాన రహదారులు NH 05 (కిన్నౌర్), NH-305 (కుల్లు) లాండ్‌స్లైడ్‌లతో మూసివేస్తున్నారు. కొంతమంది గ్రామాలు రోజుల తరబడి బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోతున్నాయి. ఇది సహాయ చర్యలకు కూడా అడ్డంకిగా మారింది. ప్రత్యేక బృందాలు రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా వంటి ప్రాథమిక సదుపాయాలను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యాయి.
ఇవి కూడా చదవండి
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 17 , 2025 | 12:23 PM