Heavy Rains: ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ..100కుపైగా ప్లైట్స్ ఆలస్యం..
ABN, Publish Date - Aug 09 , 2025 | 08:13 AM
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షం ధాటితో అనేక ప్రాంతాల్లో రోడ్లలో నీరు నిలిచిపోయింది. ఈ వెదర్ కారణంగా భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు అనేక ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి.
దేశ రాజధాని దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో శనివారం భారీ వర్షం కురుస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో నీటిమట్టం పెరిగిపోయింది. భారీ వర్షం కారణంగా భారత వాతావరణ శాఖ (IMD) దిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే వర్షం కారణంగా దిల్లీలోని కీలక ప్రాంతాలు వరద బారిన (Delhi Heavy Rains) పడ్డాయి. అందులో ఆర్కే పురం, శాస్త్రి భవన్, మోతీ బాగ్, కిద్వాయి నగర్, భారత్ మండపం గేట్ నెం. 7, మథురా రోడ్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.
ఇంకా వర్షం పడుతుందా?
వాతావరణ శాఖ ప్రకారం, దిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉండొచ్చని, కనిష్ఠం 25 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. శుక్రవారం రోజు దిల్లీలో గాలి నాణ్యత (AQI) 116గా నమోదైంది, ఇది మోస్తరు స్థాయిలోకి వచ్చింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఆగస్ట్ 14 వరకు దిల్లీ, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల నుంచి 34 డిగ్రీల మధ్య ఉండవచ్చు.
105 విమానాలు ఆలస్యం
ఈ భారీ వర్షాల కారణంగా శనివారం ఉదయం 105 విమానాలు ఆలస్యమయ్యాయి. ఉదయం 7:20 గంటలకు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ చూపించిన సమాచారం ప్రకారం, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే 13 విమానాలు, అలాగే బయటి ప్రాంతాలకు వెళ్లే మరో 92 విమానాలు లేట్ అయ్యాయి. ఆగస్ట్ 13న బంగాళాఖాతంలో (Bay of Bengal)లో అల్ప పీడనం ఏర్పడే ఛాన్సుంది. ఇది దేశవ్యాప్తంగా వాతావరణ కార్యకలాపాలను ప్రభావితం చేయనుంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ రెండో భాగంలో దిల్లీ-ఎన్సీఆర్లో మళ్లీ మంచి వర్షాలు పడే అవకాశముంది.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? లేక మారటోరియం తీసుకోవాలా?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 09 , 2025 | 08:20 AM