ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Doctor: విధుల నుంచి ప్రభుత్వ వైద్యుడి తొలగింపు.. రూ.40 లక్షల జరిమానా.. విషయం ఏంటంటే..

ABN, Publish Date - May 20 , 2025 | 01:38 PM

ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన మహిళకు సరైన వైద్యం అందించకపోగా ఆమె మృతికి కారణమయ్యాడని, ఆమె కుటుంబ సభ్యులకు రూ. 40 లక్షలు పరిహారంగా అందజేయాలని మానవ హక్కుల కమిషన్‌ తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

చెన్నై: ప్రభుత్వాస్పత్రిలో చికిత్సలకు వచ్చిన మహిళను, తన సొంత క్లినిక్‌లో చికిత్సలు అందించిన ప్రభుత్వ వైద్యుడు ప్రభాకరన్‌కు రూ.40 లక్షల జరిమానా విధిస్తూ మానవ హక్కుల కమిషన్‌ తీర్పు వెలువరించింది. కోవిల్‌పట్టి సమీపం ఇళయసేంద్రానికి చెందిన సైనికుడు కరుప్పస్వామి భార్య జయ 2018లో కాలిన గాయాలతో కోవిల్‌పట్టి ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఆస్పత్రిలో వైద్యుడు ప్రభాకరన్‌ తాను సొంతంగా నిర్వహిస్తున్న క్లినిక్‌కు ఆ మహిళను తరలించి,

ఈ వార్తను కూడా చదవండి: ఈ కానిస్టేబుల్‌ మామూలోడు కాదు.. ఏం చేశాడో తెలిస్తే మీరుకూడా


చాలా రోజులు చికిత్సలు అందించారు. అయినా చికిత్సలు ఫలించక ఆమె మృతిచెందింది. ఈ వ్యవహారంపై మృతురాలి భర్త మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారించిన కమిషన్‌ సోమవారం తీర్పు వెలువరించింది. సైనికుడు కరుప్పుస్వామికి రూ.50 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని, రూ. 40 లక్షలను వైద్యుడు ప్రభాకర్‌ నుంచి, మరో వైద్యుడు వెంకటేశ్వరన్‌ నుంచి రూ.2 లక్షలు, ఉద్యోగులు కుమరేశ్వరి,


గురులక్ష్మి నుంచి తలా రూ.లక్ష వసూలు చేయాలని, మిగిలిన రూ.6 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే, వైద్యుడు ప్రభాకరన్‌ను తొలగించాలని, మళ్లీ అతనిని ప్రభుత్వ విధుల్లో చేర్చరాదని, ఆయనపై ఛార్జిషీటు నమోదు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారా అనే విషయంపై నిఘా వేయాలని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫిర్యాదుల పెట్టెలు ఉంచాలని మానవ హక్కుల కమిషన్‌ తన తీర్పులో పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Rice Production: సస్యశ్యామల భారతం

Siricilla : పాత బకాయిలు లేనట్లేనా..?

Telangana fire services: ఇక.. మహిళా ఫైర్‌ఫైటర్లు

Read Latest Telangana News and National News

Updated Date - May 20 , 2025 | 01:38 PM