Share News

ఈ కానిస్టేబుల్‌ మామూలోడు కాదు.. ఏం చేశాడో తెలిస్తే మీరుకూడా..

ABN , Publish Date - May 20 , 2025 | 01:10 PM

ఇక్కడ కంచే చేనును మేసింది. ప్రజలకు భద్రత కల్పించాల్సిన వారే నలుగురు వేలెత్తి చూపేలా చేశాడు ఓ కానిస్టేబుల్‌. బందోబస్తు విధులకు వచ్చిన ఓ కానిస్టేబుల్.. గ్రామంలోని ఓ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డడా. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఈ కానిస్టేబుల్‌ మామూలోడు కాదు.. ఏం చేశాడో తెలిస్తే మీరుకూడా..

- మహిళపై కానిస్టేబుల్‌ అత్యాచార యత్నం

చెన్నై: స్థానిక పళవేర్కాడు సమీపంలోని జాలర్ల గ్రామంలో ఘర్షణల కారణంగా ఆ ప్రాంతంలో పోలీసు భద్రత ఏర్పాటుచేశారు. నడువర్‌ మాదాకుప్పం గ్రామంలో చేపలు పట్టే విషయంలో జాలర్ల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో, ఇరువర్గాలుగా విడిపోయిన జాలర్లు పరస్పర ఘర్షణలకు పాల్పడుతున్నారు. జాలర్ల మధ్య సఖ్యత నెలకొల్పేలా ఆర్డీఓ, తహసీల్దార్‌, తిరుపాలైవనం పోలీసులు చర్చలు జరిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: 24నుంచి కొడైకెనాల్‌లో 62వ పుష్ప ప్రదర్శన


చర్చల సమయంలో సఖ్యతగా ఉంటామని తెలిపిన జాలర్లు, అధికారులు వెళ్లిన వెంటనే మళ్లీ ఘర్షణలకు పాల్పడుతున్నారు. గ్రామంలో ఘర్షణలు అదుపుచేసేలా వారం నుంచి 30 మంది పోలీసులు 24 గంటలు భద్రతా విధులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఆదివారం రాత్రి ఆ గ్రామానికి చెందిన దినేష్‌(Dinesh), తన కుమార్తెతో కలసి ఇంటి ముందు నిద్రించాడు. అర్ధరాత్రి దినేష్‌ కుమార్తె టాయిలెట్‌ వెళ్లగా,


గ్రామంలో భద్రతా విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ సుధాకర్‌ (24) ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో సుధాకర్‌ ఇంట్లోకి వెళ్లి బీరువా వెనుక దాక్కున్నాడు. చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని సుధాకర్‌ను తిరుపాలైవనం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, సుధాకర్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచి, న్యాయమూర్తి ఉత్తర్వులతో రిమాండ్‌ నిమిత్తం పుళల్‌ జైలుకు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Rice Production: సస్యశ్యామల భారతం

Siricilla : పాత బకాయిలు లేనట్లేనా..?

Telangana fire services: ఇక.. మహిళా ఫైర్‌ఫైటర్లు

Read Latest Telangana News and National News

Updated Date - May 20 , 2025 | 01:10 PM