Share News

Gold Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - May 20 , 2025 | 06:32 AM

బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి కీలక అలర్ట్. గత కొన్ని రోజులుగా తగ్గిన పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో మే 20, 2025న వీటి ధరలు మళ్లీ పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయి. ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold rates today May 20th 2025

దేశంలో పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఓసారి ఈ రేట్లను తెలుసుకుని వెళ్లండి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో మే 20, 2025న బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ క్రమంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈరోజు (gold rates today may 20th 2025) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 400 పెరిగి రూ.95,520 స్థాయికి చేరుకుంది. 22 క్యారెట్ పసిడి ధర 10 గ్రాములకు రూ.370 పెరిగి రూ. 87,560కు చేరింది. మరోవైపు ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.95,670 కాగా, 22 క్యారెట్ పసిడి ధర 10 గ్రాములకు రూ. 87,710గా కలదు.


నేటి వెండి ధరలు..

ఇదే సమయంలో వెండి ధరలు కూడా భారీగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో మే 20 నాటికి ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1300 పెరిగి రూ.98,100కు చేరింది. ఇక హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తిరుపతిలో కేజీ వెండి రేటు రూ.1,09,000గా ఉంది. అంతేకాదు చెన్నై, కేరళ, భోపాల్‌ వంటి ప్రాంతాల్లో కూడా వెండి ధరలు రూ.1,09,000గా ఉన్నాయి. మరోవైపు సోలాపూర్, నోయిడా, నాసిక్, మైసూర్, సూరత్, నాగ్ పూర్, పాట్నా, జైపూర్, ముంబై ప్రాంతాల్లో కిలో వెండి ధరలు రూ. 98,100గా కలవు.


స్వచ్ఛమైన బంగారాన్ని ఎలా గుర్తించాలి

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి అంతర్జాతీయ ప్రామాణీకరణ సంస్థలు హాల్ మార్కులను ఇస్తాయి. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది. చాలా వరకు బంగారం 22 క్యారెట్లలో అమ్ముడవుతుండగా, కొంతమంది 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో రాగి, వెండి, జింక్ వంటి 9% ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనది అయినప్పటికీ, 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు తయారు చేయలేం. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్లలో బంగారాన్ని అమ్ముతారు.


ఇవీ చదవండి:

Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

SBI: ఎఫ్‌డీ ఆశలకు బ్రేక్.. రెండోసారి కోత పెట్టిన ఎస్‌బీఐ


మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 06:51 AM