ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Governor Haribabu: ఇండియాకు బుద్దుడి పవిత్ర అవశేషాలు

ABN, Publish Date - Jun 03 , 2025 | 01:45 PM

బుద్ధుడి పవిత్ర అవశేషాలను భారత్‌కు తిరిగి తీసుకువచ్చారు. వియత్నాం నుంచి ఒడిశా గవర్నర్ హరిబాబు.. బుద్దుడి అవశేషాలను ఇండియాకు తీసువచ్చారు.

Governor Kambhampati Haribabu

ఇంటర్నెట్ డెస్క్: బుద్దుడి పవిత్ర అవశేషాలను వియత్నాం నుంచి భారతదేశానికి ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ( Governor Kambhampati Haribabu) తీసుకువచ్చారు. బుద్ధుడి పవిత్ర అవశేషాలను భారత్‌కు తీసుకురావడానికి గవర్నర్ హరిబాబుని వియత్నాంకు కేంద్రం ప్రభుత్వం పంపించింది. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వియత్నాంలో పవిత్ర బుద్ఢుని అవశేషాలను ప్రదర్శించిన తర్వాత వాటిని ఇండియాకు తీసుకువచ్చారు. దీనిపై గవర్నర్ కంభంపాటి హరిబాబు ఓ ప్రకటన విడుదల చేశారు.


వియత్నాం పర్యటనలో భాగంగా క్వాంగ్ నామ్ ప్రావిన్స్‌లోని ప్రముఖ మై సన్ దేవాలయ సముదాయాన్ని గవర్నర్ కంభంపాటి హరిబాబు సందర్శించారు. మై సన్ ప్రాంతాన్ని వియత్నాంలో అత్యంత విలువైన సాంస్కృతిక స్థలాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంగణాన్ని భారత పురావస్తు సర్వే (ASI) సహాయంతో పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్.. వియత్నాం పర్యటనకు ప్రాధాన్యం లభించింది. అలాగే ఇక్కడ ఉన్న కొన్ని హిందూ దేవాలయాలను 4వ శతాబ్దం నాటివిగా భావిస్తున్నారు. ఈ దేవాలయాలను చంపా రాజవంశం నిర్మించింది. ఇవి ఆగ్నేయాసియా సంయుక్త సాంస్కృతిక వారసత్వానికి గుర్తుగా ఉన్నాయి. ఈ పర్యటన సందర్భంగా ఇండియా సహకారంతో జరుగుతున్న పునరుద్ధరణ పనుల పురోగతిని గవర్నర్ సమీక్షించారు.


ఈ పురాతన నిర్మాణాలను సంరక్షించేందుకు ఉపయోగిస్తున్న ప్రత్యేక సాంకేతికత గురించి అధికారులు గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబుకి వివరించారు. ఈ దేవాలయ సముదాయం ఒక అందమైన లోయలో ఉంది. చుట్టూ పచ్చని పర్వతాలు, ప్రవహిస్తున్న వన జలధారల మధ్య విస్తరించి ఉంది. ఇది 7వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకూ చంపా నాగరికతకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా పనిచేసింది. ప్రస్తుతం మై సన్‌లో దాదాపు 70 దేవాలయ నిర్మాణాలు ఉన్నాయి. ప్రత్యేక శైలిలో వీటిని నిర్మించడంతో ఇవి శతాబ్దాలుగా స్థిరంగా నిలిచాయి. చరిత్రకారులు, వాస్తుశిల్ప నిపుణులను ఇవి నేటికీ ఆకర్షిస్తున్నాయి. ఈ స్థలం చంపా రాజ్యం, భారతదేశం, చైనాల మధ్య ఉన్న సాంస్కృతిక బంధాలనూ ప్రతిబింబిస్తోంది. ఒడిశా గవర్నర్ పర్యటన భారత్-వియత్నాం మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని, సంయుక్త వారసత్వాన్ని సంరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కారులో మంటలు.. ప్రయాణీకులు సురక్షితం..

2కె రన్‌లో పాల్గొన్న ‘భైరవం’ చిత్రం యూనిట్

For More AP News and Telugu News

Updated Date - Jun 03 , 2025 | 03:20 PM