రాహుల్ గాంధీ పాకిస్థాన్ ఏజెంట్‌లా ప్రవర్తిస్తున్నారు: ఏక్‌నాథ్ షిండే
ABN, Publish Date - Jun 20 , 2025 | 08:18 AM
Rahul Gandhi vs Eknath Shinde: ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ ప్రవర్తన పాకిస్థాన్ ఏజెంట్‌లా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Eknath Shinde slams Rahul Gandhi: ఆపరేషన్ సిందూర్ తర్వాత లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్రంగా విమర్శించారు. రాహుల్ పాకిస్థాన్ భాష మాట్లాడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఆయనకు నిషాన్-ఎ-పాకిస్తాన్ గౌరవం కావాలా? అంటూ మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చిందని షిండే అన్నారు. అధికారం కోసం ఉద్ధవ్ ఠాక్రే తన భావజాలాన్ని మోసం చేశారని, దాని కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని ఆయన అన్నారు. గురువారం శివసేన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా షిండే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటివారు దేశద్రోహలు: ఏక్‌నాథ్ షిండే
NSCI డోమ్‌లో పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే ప్రసంగించారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, ప్రధాని మోదీ పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చారని అన్నారు. మన సైన్యం అక్కడ పనిచేస్తున్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇప్పటివరకు, ఏ ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఇలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇదీ.. మన ప్రధానమంత్రి మోదీ స్టామినా అని అన్నారు. అయినప్పటికీ, రాహుల్ గాంధీ మన సైన్యం, ప్రధాన మంత్రిపై అపనమ్మకం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రిపై విశ్వాసం చూపిస్తున్నారని విమర్శించారు.
శివసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండే ప్రతిపక్ష పార్టీలపై దాడి చేశారు. ఈ సందర్భంగా, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ప్రశ్నించిన వారిని ఆయన 'దేశద్రోహులు' గా అభివర్ణించారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పాకిస్థాన్ ఏజెంట్ అంటూ షిండే తీవ్ర ఆరోపణలు చేశారు. శివసేన యూబీటి చీఫ్ ఉద్ధవ్ థాకరే హిందూత్వాన్ని విడిచిపెట్టారని షిండే విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Axiom-4: యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా
Amit Shah: ఇంగ్లిష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజొస్తుంది
For National News And Telugu News
Updated Date - Jun 20 , 2025 | 04:24 PM