Chennai: కన్నీరు వద్దు తంబీ.. దివ్యాంగ విద్యార్థికి సీఎం స్టాలిన్ భరోసా
ABN, Publish Date - May 09 , 2025 | 01:10 PM
కన్నీరు వద్దు తంబీ.. మన వైద్యఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం నీకు తగిన వైద్యం అందేలా ఏర్పాటు చేస్తారు.. అంటూ ఓ దివ్యాంగ విద్యార్ధికి భరోసా ఇచ్చారు. ఓ ప్రమాదంలో చేతిని కోల్పోయి అతని దీనస్థితిపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దీనిపై సీఎం స్టాలిన్ స్పందించి భరోసా కల్పించారు.
చెన్నై: ప్లస్ టూ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన దివ్యాంగ విద్యార్థి కోరికపై స్పందించిన ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ‘కన్నీరు వద్దు తంబీ’ అంటూ ఓదార్చారు. కృష్ణగిరి(Krishnagiri) జిల్లా వెప్పంహళ్లి సమీపం నెడుమరుది గ్రామానికి చెందిన కీర్తివర్త చేతులు లేకుండా జన్మించాడు. కొన్నేళ్ల కిత్రం తండ్రి మృతిచెందిన నేపథ్యంలో, తల్లి కూలి పనులకు వెళ్తూ అతడిని చదివిస్తోంది. రెండేళ్ల క్రితం పదవ తరగతి పరీక్షల్లో 500 మార్కులకు 437 మార్కులు సాధించిన కీర్తివర్మ, పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచాడు.
ఈ వార్తను కూడా చదవండి: EPS: నా ప్రసంగం ప్రసారం చేస్తే డీఎంకే సర్కారు పతనమే..
గురువారం విడుదలైన ప్లస్ టూ పరీక్షల్లో 600 మార్కులకు 471 మార్కులు సాధించాడు. గురువారం మీడియాతో మాట్లాడిన కీర్తివర్మ... నేను ఇంజనీరింగ్ చదవాలని ఆశగా ఉన్నాను. అనంతరం మంచి ఉద్యోగం చేయాలని ఉంది. కానీ, రెండు చేతులు లేకపోవడంతో ఏ పనీ చేయలేకపోతున్నాను.
ఒకరి సాయం లేకుండా జీవించలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి సాయం చేయాలని కోరాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలువడ్డాయి. ఈ విషయమై సీఎం స్టాలిన్ తన ఎక్స్‌లో... ‘కన్నీరు వద్దు తంబీ...! మంత్రి సుబ్రమణ్యం నీకు తగిన వైద్యం అందేలా ఏర్పాటు చేస్తారు’ అంటూ పోస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Breaking News: భారత్-పాక్ యుద్ధంపై చైనా తాజా రియాక్షన్ ఇదే..
ToDay Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చనిపోయాడా ..?
Operation Sindoor: యుద్ధ బీభత్సం
Read Latest Telangana News and National News
Updated Date - May 09 , 2025 | 01:10 PM