Share News

EPS: నా ప్రసంగం ప్రసారం చేస్తే డీఎంకే సర్కారు పతనమే..

ABN , Publish Date - May 09 , 2025 | 12:23 PM

నా ప్రసంగం ప్రసారం చేస్తే డీఎంకే సర్కారు పతనమేనని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తుందని ఆయన అన్నారు.

EPS: నా ప్రసంగం ప్రసారం చేస్తే డీఎంకే సర్కారు పతనమే..

- అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి

చెన్నై: అసెంబ్లీలో ప్రజా సమస్యలు తదితర అంశాల గురించి ప్రతిపక్ష నేతగా తాను మాట్లాడడాన్ని పూర్తిగా టీవీలో ప్రచారం చేస్తే డీఎంకే ప్రభుత్వ పతనం ఖాయమేనని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) పేర్కొన్నారు. సేలం ఓమలూరులోని అన్నాడీఎంకే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే అధికారంలోవున్నా.. లేకున్నప్పటికీ ప్రజల కోసమే పనిచేస్తుందని, అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు మరిచిపోలేదన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Operation Sindoor: యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్.. ఎలా పని చేస్తుందంటే


ఆచరణకు అమలుకాని హామీలతో ప్రజలను నమ్మించి డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, ఇలాంటి వాస్తవాలను ప్రసారం చేయాల్సిన బాధ్యత మీడియాదేనన్నారు. దేశరాజధాని ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రిని తాను కలిసిన అనంతరం రాష్ట్రంలో పెండింగులోవున్న పథకాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ మోడల్‌ ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు.


నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు ఇప్పటివరకు నిధులు కేటాయించలేదని, మరోవైపు హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల కోసం బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు కుదుర్చుకుందని, ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉందని, ఆ లోగా మరికొన్ని పార్టీలు తమ కూటమిలో చేరుతాయని ఈపీఎస్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Breaking News: భారత్-పాక్ యుద్ధంపై చైనా తాజా రియాక్షన్ ఇదే..

ToDay Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

నవ్వించడమే సింగిల్‌ లక్ష్యం

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చనిపోయాడా ..?

Operation Sindoor: యుద్ధ బీభత్సం

Read Latest Telangana News and National News

Updated Date - May 09 , 2025 | 12:23 PM