ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Udayanidhi Stalin: ఈడీకో, మోదీకో డీఎంకే భయపడదు.. నీతి ఆయోగ్‌కు స్టాలిన్ హాజరుపై ఉదయనిధి

ABN, Publish Date - May 24 , 2025 | 09:40 PM

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారంనాడు ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల స్టేట్ రన్ లిక్కర్ కార్పొరేషన్ 'టాస్మాక్ ' కార్యాలయంపై ఈడీ దాడులు జరిపిన నేపథ్యంలో స్టాలిన్ ఢిల్లీ పర్యటన చేపట్టారని విపక్ష అన్నాడీఎంకే ఆరోపించింది.

చెన్నై: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కు కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)కి గానీ డీఎంకే భయపడే ప్రసక్తి లేదని, ఎలాంటి అంశాలనైనా లీగల్‌గానే ఎదుర్కొంటామని ఆ పార్టీ నేత, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) అన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లనైనా ఎదుర్కొని రాష్ట్ర హక్కులను కాపాడేందుకు తమ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పారు.

PM Modi: ఎన్డీయే ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం


తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారంనాడు ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల స్టేట్ రన్ లిక్కర్ కార్పొరేషన్ 'టాస్మాక్' కార్యాలయంపై ఈడీ దాడులు జరిపిన నేపథ్యంలో స్టాలిన్ ఢిల్లీ పర్యటన చేపట్టారని విపక్ష అన్నాడీఎంకే ఆరోపించింది. మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని జరిగిన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్, బీహార్ ,పుదుచ్చేరి హాజరుకాలేదు.


కాగా, స్టాలిన్ ఢిల్లీ పర్యటనపై అన్నాడీఎంకే చేసిన వ్యాఖ్యలపై మీడియాతో ఉదయనిధి మాట్లాడుతూ, ఈడీకో, మోదీకో తాము భయపడమన్నారు. కళైంజ్ఞర్ ఎం.కరుణానిధి స్థాపించిన పార్టీ, పెరియార్ ఆత్మీగౌరవ సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ తమదని చెప్పారు. తమిళనాడుకు కేంద్ర నిధులను రాబట్టేందుకే సీఎం స్టాలిన్ ఢిల్లీ వెళ్లారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలోనూ తమను భయపట్టాలనుకుందని, కానీ తాము లొంగలేదని చెప్పారు. తమది దాస్యం చేసే పార్టీకాదని, చట్టపరంగానే ఏ కేసులైనా ఎదుర్కొంటామని చెప్పారు. కాగా, కేంద్ర పన్నులల్లో రాష్ట్రానికి 50 శాతం షేర్ పెంచాలని నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని ఎంకే స్టాలిన్ కోరారు.


ఇవి కూడా చదవండి..

Covid 19 Cases in India: ఢిల్లీ, ముంబైలో కోవిడ్ కేసులు.. ఆసుపత్రుల్లో హైఅలర్ట్

Rains: రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు

Karnataka: జైలు నుంచి విడుదలయ్యాక ఊరేగింపు.. కర్ణాటక అత్యాచార నిందితుల అరెస్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 24 , 2025 | 09:42 PM