Share News

Rains: రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు

ABN , Publish Date - May 24 , 2025 | 12:00 PM

రాష్ట్రంలో.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా.. భారీ వర్ష సూచనతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు రంగంలోకి దిగుతున్నాయి.

Rains: రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు

- రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు

చెన్నై: కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలకు ఆదివారం నుంచి రెండు రోజుల పాటు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యల్లో భాగంగా ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బలగాలను రంగంలోకి దింపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం, మరింత బలపడి ఉత్తర దిశగా పయనించి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో 25, 26 తేదీల్లో కోయంబత్తూర్‌ జిల్లాలోని కొండ ప్రాంతాలు,


నీలగిరి జిల్లాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశముంది. దిండుగల్‌, తేని, తెన్‌కాశి జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురవనున్నాయి. అదేవిధంగా తిరుప్పూర్‌, తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముంది.


nani1.2.jpg

అతి భారీవర్ష సూచన నేపథ్యంలో, కోవై, నీలగిరి జిల్లాలకు రాష్ట్ర జాతీయ విపత్తు నిర్వహణకు చెందిన మూడు బృందాలు వెళ్లాయి. ఊటీ, వాల్పారై ప్రాంతాలకు తలా ఒక బృందం, కోవైలో మరో బృందం మకాం వేసి పరిస్థితులను పర్యవేక్షించనుంది. అలాగే, సీనియర్‌ అధికారులు రెండు జిల్లాలకు వెళ్లి పరిశీలించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి నష్టం జరగకుండా పర్యవేక్షించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలియజేసింది.



ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..

Kaleshwaram: కాళేశ్వరంలో నవరత్న మాల హారతి!

Read Latest Telangana News and National News

Updated Date - May 24 , 2025 | 12:00 PM