ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: మెరీనా సముద్రంలో సుడిగుండం.. స్నానాలను నిషేధించిన పోలీసులు

ABN, Publish Date - May 22 , 2025 | 12:03 PM

చెన్నై మెరీనా సముద్రంలో 7 ప్రాంతాల్లో సుడిగుండాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతాల్లో సముద్రంలో దిగి స్నానం చేయరాదని గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ సంయుక్త కమిషనర్‌ విజయ్‌కుమార్‌ నగరవాసులు, పర్యాటకులకు సూచించారు. మెరీనా బీచ్‌ తీరానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

- స్నానాలను నిషేధించిన పోలీసులు

చెన్నై: స్థానిక ట్రిప్లికేన్‌లోని నేపియర్‌ వంతెన నుంచి మైలాపూర్‌ పట్టినంబాక్కం వరకు ఉన్న మెరీనా సముద్రంలో 7 ప్రాంతాల్లో సుడిగుండాలు ఏర్పడ్డాయని, ఈ ప్రాంతాల్లో సముద్రంలో దిగి స్నానం చేయరాదని గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ సంయుక్త కమిషనర్‌ విజయ్‌కుమార్‌(Vijaykumar) బుధవారం నగరవాసులు, పర్యాటకులను హెచ్చరించారు. ప్రపంచంలో సుందరమైన, పొడవైన రెండవదిగా పేరొందిన మెరీనా బీచ్‌ తీరంలో సేదతీరేందుకు నగరం నుండేకాక, శివారు ప్రాంతాలు, పలు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ప్రతిరోజు తరలివస్తుంటారు.

ఈ వార్తను కూడా చదవండి: Krishna Water: తమిళనాడు సరిహద్దుకు చేరుకున్న కృష్ణా జలాలు


సముద్రంలో దిగకుండా పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లను కల్పించి హెచ్చరిస్తున్నా.. పట్టించుకోని కొంతమంది మెరీనాలో స్నానాలకు దిగి అలల తాకిడికి గురై మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో, నేపియర్‌ బ్రిడ్జి నుంచి పట్టినంబాక్కం వరకు మెరీనా సముద్రతీరంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ సంయుక్త కమిషనర్‌ విజయ్‌కుమార్‌ పోలీసులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. మెరీనాలో ఏడు ప్రాంతాల్లో సుడిగుండం ఏర్పడిందని హెచ్చరిస్తూ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం వల్ల మంచి ఫలితం ఉంటుందని స్థానిక మత్య్సకారులు అభిప్రాయం వ్యక్తంచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. చివరకు..

కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి

Read Latest Telangana News and National News

Updated Date - May 22 , 2025 | 12:03 PM